logo

డ్రగ్స్‌కు బానిసై.. విక్రయాల బాట

ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్‌ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు

Updated : 18 Apr 2024 05:05 IST

చిక్కిన యువకులు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్‌ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు. మాదాపూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరంవాసి రైల్వేలో సీనియర్‌ అధికారి. ఆయన కుమారుడు సూర్యకుమార్‌(22) బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ యూనివర్సిటీలో బీటెక్‌ పూర్తిచేశాడు. అక్కడే చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. తన స్నేహితుడు అభితో నైజీరియాకు చెందిన డ్రగ్స్‌ స్మగ్లర్‌ గాడ్‌ ఆఫ్‌ సొల్మెన్‌ పరిచయమయ్యాడు. అతని నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ కొని తీసుకునేవాడు. క్రమంగా డబ్బుల కోసం డ్రగ్స్‌ విక్రయాలు మొదలుపెట్టాడు. ఈనెల 14న సూర్యకుమార్‌ బెంగళూరు వెళ్లి సోల్మెన్‌వద్ద 30 గ్రాముల ఎండీఎంఏ కొన్నాడు. 16న హైదరాబాద్‌కు వచ్చి స్నేహితుడు శ్యామ్‌బాబును రాజమహేంద్రవరం నుంచి పిలిపించాడు. ఇద్దరూ కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు గ్రాముల ఎండీఎంఏ సేవించారు. మిగిలింది విక్రయించాలనుకున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం మాదాపూర్‌లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి వద్ద రూ.5.70లక్షల విలువైన 28గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌, 2 ఫోన్లు స్వాధీనంచేసుకున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని