logo

సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు

పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది.

Published : 18 Apr 2024 04:26 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి: పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. బిడ్డ పుట్టిన వెంటనే ఆసుపత్రి, మృతి చెందిన వెంటనే వైకుంఠధామాల వద్దనే సిబ్బందికి ఇచ్చిన ప్రత్యేక యాప్‌ ద్వారా వివరాలను నమోదు చేస్తారు. ఆ వెంటనే దరఖాస్తుదారునికి చరవాణికి సమాచారం వస్తుంది. మీ-సేవా కేంద్రాలకు వెళ్లి దాన్ని చూపించి ప్రింట్‌ తీసుకోవచ్చు.

 సిబ్బందికి ప్రత్యేక శిక్షణ: జిల్లాలోని 4 పురపాలక సంఘాల్లో నూతన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా కొత్తగా రూపొందించిన యాప్‌, సాఫ్ట్‌వేర్‌పై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పట్టణాల పరిధిలోని ఆసుపత్రుల సిబ్బంది, వైకుంఠధామాల వద్ద దీనిపై అవగాహన కల్పిస్తారు. వీరి వద్ద ఉన్న చరవాణికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. పూర్తి స్థాయి శిక్షణ అనంతరం దీని ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసుపత్రుల్లో చనిపోతే అక్కడే వివరాలను నమోదు చేస్తారు. ఒక వేళ ఇంటి వద్ద మరణిస్తే సమీపంలోని వైకుంఠధామాల దగ్గర పనిచేసే వారు చరవాణి ద్వారా వారి వివరాలు తీసుకుంటారు. ఆసుపత్రులు, వైకుంఠధామాల వద్దనే చనిపోయిన వారి వివరాలను నమోదు చేసుకుంటే ఎలాంటి తప్పులు రాకుండా ఉంటాయి.  

 24 గంటల్లో నమోదు: ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు సంబంధించిన వివరాలు 24 గంటల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లలకు పేరు ఉండదు. 21 రోజుల తర్వాత ఎప్పుడైనా పేరు చేర్చాలని మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని