logo

గిన్నిస్‌బుక్‌లో చోటు సాధించిన అజయ్‌కుమార్‌

ఇంటర్నేషనల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్‌ఎంఈ ఛాంబర్స్‌ ఆఫ్‌ ఇండియా సలహాదారు డాక్టర్‌ అజయ్‌కుమార్‌ అగర్వాల్‌ గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

Updated : 19 Apr 2024 04:35 IST

పత్రాలను చూపుతున్న డాక్టర్‌ అజయ్‌కుమార్‌, అజయ్‌మిశ్రా

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఇంటర్నేషనల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్‌ఎంఈ ఛాంబర్స్‌ ఆఫ్‌ ఇండియా సలహాదారు డాక్టర్‌ అజయ్‌కుమార్‌ అగర్వాల్‌ గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఈ మేరకు గురువారం జూబ్లీహిల్స్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ ఛైర్మన్‌ అజయ్‌మిశ్రాతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అజయ్‌మిశ్రా మాట్లాడుతూ 23 మంది పాజిటివ్‌ ఛేంజ్‌మేకర్స్‌ ఇన్‌ ది వరల్డ్‌లో డాక్టర్‌ అజయ్‌కుమార్‌ పేరు చేర్చడం గర్వకారణమని అన్నారు. అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ నిర్వాహక కమిటీ నుంచి ఇప్పటికే గుర్తింపు పత్రంతోపాటు విజేతల ప్రొఫైల్‌తో కూడిన పుస్తకాన్ని అందుకున్నట్లు చెప్పారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని