logo

రేవంత్‌రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.

Published : 23 Apr 2024 04:06 IST

 

ఫిల్మ్‌నగర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే 30వేల వేల ఉద్యోగాలిచ్చామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ఒక ఉద్యోగం ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో సామాన్యుడికి ఉన్న అవగాహన సీఎంకు లేదన్నారు. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సీఎం వక్రీకరించి మాట్లాడుతున్నారని, భాజపాతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ముప్పు అని కేసీఆర్‌ అన్నారని గుర్తు చేశారు. రేవంత్‌ మాత్రం ప్రతి సభలో కేసీఆర్‌ తన ప్రభుత్వాన్ని కూలుస్తారన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం.. కాంగ్రెస్‌ పాలనలో వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని భారాస నాయకుడు చిరుమళ్ల రాకేష్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. మైనార్టీలకు చెందిన ఆస్తులను ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందన్నారు. నాంపల్లిలో వక్ఫ్‌ భూమిలో ఉన్న పెద్ద భవనాన్ని కొందరికి కారు చౌకగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. అనీస్‌ ఉల్‌ గుర్భాను ఇతర అవసరాలకు వినియోగించడం దురదృష్టకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని