logo

ప్రకృతి ఉరిమింది.. పంట మునిగింది

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దేవనకొండ, పత్తికొండ మండలాల్లో పంటలన్నీ నీట మునిగాయి. దీంతో పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దేవనకొండలో నాలుగో ఎకరాల్లో వేసిన పత్తి పంటను కాపాడుకునేందుకు రైతు ఎల్లయ్య డీజిల్‌ ఇంజిన్‌ తెచ్చుకుని రెండు రోజులుగా నీటిని

Published : 10 Aug 2022 01:49 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దేవనకొండ, పత్తికొండ మండలాల్లో పంటలన్నీ నీట మునిగాయి. దీంతో పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దేవనకొండలో నాలుగో ఎకరాల్లో వేసిన పత్తి పంటను కాపాడుకునేందుకు రైతు ఎల్లయ్య డీజిల్‌ ఇంజిన్‌ తెచ్చుకుని రెండు రోజులుగా నీటిని తోడుతున్నారు. రోజుకు రూ.వెయ్యి ఇచ్చి ఇంజిన్‌ను అద్దెకు తెచ్చుకున్నట్లు రైతు తెలిపారు. ఆయిల్‌కు సుమారు రూ.600 వరకు ఖర్చవుతోందన్నారు. లోతట్టు ప్రాంతాలతోపాటు హంద్రీ నదికి రెండు వైపుపలా సుమారు వంద ఎకరాల్లో పంటలు మునిగిపోయినట్లు రైతులు తెలిపారు.

- ఈనాడు, కర్నూలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని