logo

విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్‌ తెదేపాలో చేరిక

విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్‌ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు.

Published : 18 Apr 2024 04:40 IST

ఎలమంచిలి, న్యూస్‌టుడే: విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్‌ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. వీరికి నాగేశ్వరరావు, పప్పల చలపతిరావు కండువాలు కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు. ఈయన కొక్కిరాపల్లి పీఏసీఎస్‌ ఛైర్మన్‌గా రెండుసార్లు పనిచేశారు. ఈయనతో పాటు దాడి రమేష్‌, మరో వంద మందికి పైగా వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. జగన్‌ పాలన అవినీతిగా మారిందని, అందుకే ఆ పార్టీని వీడి తెదేపాలో చేరామని వీరంతా చెప్పారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో వైకాపా అంతాఖాళీ అవుతుందన్నారు. ఇప్పటికే అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక మండలల్లో చాలా మంది వైకాపాను వీడి తెదేపాలో చేరారన్నారు. మిగిలిన వారు చేరడానికి సిద్ధంగా ఉన్నారని, నియోజకవర్గంలో వైకాపాకు అడ్రస్‌ ఉండదన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారన్నారు. గెలుపు కోసం కష్టపడి పనిచేస్తున్నామన్నారు. నాయకులు రాజాన నారాయణమ్మ, గొర్లె నానాజీ, ఆడారి ఆదిమూర్తి, ఆడారి రమణబాబు, కాండ్రకోట చిరంజీవి, సూరకాసుల రమణబాబు, పిల్లా ఆదిబాబు, భాజపా నాయకులు పప్పు ఈశ్వరరావు, నక్కా శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని