logo

‘రాజీవ్‌ స్వగృహ’ దరఖాస్తులకు నకిలీ నోట్ల బెడద

నగర శివారు బండ్లగూడ, పోచారంలో రాజీవ్‌ స్వగృహ నివాసాల కొనుగోలు కోసం దరఖాస్తుకు చెల్లిస్తున్న నగదులో నకిలీ నోట్ల బెడద ఎక్కువైంది.

Published : 20 May 2022 01:58 IST

కేవలం ‘ఆన్‌లైన్‌’కే అవకాశం.. సర్వర్‌ మొరాయింపుతో అవస్థలు

బండ్లగూడ, న్యూస్‌టుడే: నగర శివారు బండ్లగూడ, పోచారంలో రాజీవ్‌ స్వగృహ నివాసాల కొనుగోలు కోసం దరఖాస్తుకు చెల్లిస్తున్న నగదులో నకిలీ నోట్ల బెడద ఎక్కువైంది. గురువారం నుంచి నగదు చెల్లింపుతో దరఖాస్తు చేసుకునే విధానాన్ని రద్దు చేసి, కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 12 నుంచి రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి నేరుగా లేదా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జూన్‌ 22న ఆన్‌లైన్‌ లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనేక మంది బండ్లగూడలోని స్వగృహ నివాసాలు చూసేందుకు వస్తున్నారు. అక్కడే ఉన్న కేంద్రంలో దరఖాస్తు నింపి నేరుగా రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. అలా వచ్చిన నగదును బ్యాంకుల్లో జమ చేసేందుకు వెళ్తే నిత్యం ఎన్నో కొన్ని నకిలీ నోట్లు బయటపడుతున్నట్లు కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టారు. ఒక్కసారిగా ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరగడంతో సర్వర్లు మొరాయించి దరఖాస్తుదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించినట్లు, ఖాతాల నుంచి బదిలీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు సందేశాలు వస్తున్నా.. స్వగృహ కార్పొరేషన్‌ ఖాతాకు జమ అయినట్లు చూపడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు