
Viral Video:సమంత ఐటెం సాంగ్‌కి బీటీఎస్ బ్యాండ్ స్టెప్పేస్తే..!
హైదరాబాద్: ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఆల్బమ్స్ ఎప్పుడూ సూపర్‌హిట్టే. తాజాగా వచ్చిన ‘పుష్ప’ అందుకు నిదర్శనం. ఊరమాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈసినిమాలో ప్రతి పాటా సెన్సేషనల్ అయ్యింది. ముఖ్యంగా ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’ పాట యూట్యూబ్‌లో మిలియన్లలో వ్యూస్ సొంతం చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. పురుషుల స్వభావాన్ని తెలియజేసే లిరిక్స్‌తో రూపుదిద్దుకున్న ఈ ఐటెం సాంగ్‌లో సమంత వంటి అగ్రకథానాయిక ఆడిపాడటంతో దీనికి మరింత క్రేజ్ వచ్చింది. స్క్రీన్‌పై సామ్-బన్నీ వేసిన స్టెప్పులు చూసి ప్రతి ఒక్కరూ దీనికి ఫ్యాన్స్ అయిపోయారు. దీంతో ఈ పాటకు ఇప్పటికే పలువురు కవర్ సాంగ్స్, రీల్స్ చేసి ఆకట్టుకున్నారు.
ఇప్పుడు ‘పుష్ప’ సాంగ్స్‌కు కొంతమంది నెటిజన్లు ఎడిటింగ్ వీడియోలు క్రియేట్ చేసి అదరగొడుతున్నారు. ఇందులో భాగంగా, కొరియన్ ప్రముఖ పాప్ సింగింగ్ బ్యాండ్ బీటీఎస్ చేసిన ‘బాయ్ విత్ లవ్’ వీడియోకు ‘ఊ అంటావా మావ’ పాటను జత చేస్తూ ఓ నెటిజన్ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశాడు. ‘‘పుష్ప’ బీట్‌ని బీటీఎస్ ఫాలో కాలేదు. బీటే బీటీఎస్ని ఫాలో అయ్యింది’’ అని నెటిజన్ రాసుకొచ్చాడు. ఈ వీడియోలో బీటీఎస్ బృందం ఆర్ఎం, జిన్, సుగా, జె.హోప్, జిమిన్, వి, జంగ్‌కూక్ వేసిన స్టెప్పులు.. మన తెలుగు పాట బీటుకు సరిపోయేలా ఉండటంతో ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ ‘శ్రీవల్లి’ పాటకు స్టెప్పులేసినట్లుగా ఉన్న యానిమేటెడ్ వీడియోను మరో నెటిజన్ క్రియేట్ చేశాడు. ఇది కూడా నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.