Animal: అందుకే ‘యానిమల్‌’ను వాయిదా వేస్తున్నాం.. కొత్త తేదీని ప్రకటించిన దర్శకుడు

‘యానిమల్‌’ విడుదలను వాయిదా వేస్తున్నట్లు సందీప్‌ వంగా వెల్లడించారు. ఈ మేరకు కొత్త విడుదల తేదీని తెలుపుతూ వీడియో విడుదల చేశారు.

Updated : 03 Jul 2023 16:56 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న సినిమా ‘యానిమల్‌’ (Animal). సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా ఇది తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు సందీప్‌ వంగా ప్రకటించారు. దీనికి గల కారణాన్ని, కొత్త విడుదల తేదీని తెలుపుతూ ఆయన వీడియో షేర్‌ చేశారు.

‘‘ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇందులో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. ఐదు భాషలకు తగ్గట్లు వాటిల్లో మార్పులు చేయాలి. మొత్తం 35 పాటలకు వర్క్‌ చేయాలి. వీటిని రికార్డ్‌ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అందువల్లే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఆలస్యమవుతున్నాయి. హిందీ కాకుండా మిగతా భాషల్లో ఈ పాటలు విన్న వారికి డబ్బింగ్‌ పాటల్లా అనిపించకూడదని నా అభిప్రాయం. అందుకే చాలా శ్రద్దగా వర్క్‌ చేస్తున్నాం. దీనికోసం చాలా సమయం, ఎనర్జీ పెట్టాల్సి ఉంటుంది. ప్రేక్షకులందరికీ వీడియో, ఆడియో పరంగా కూడా సినిమాను ఉత్తమంగా అందిస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయాలని భావించాం. కానీ ప్రోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో జాప్యం కారణంగా దీన్ని డిసెంబర్‌1కు వాయిదా వేస్తున్నాం. కంటెంట్‌, భావోద్వేగాల పరంగా ఇది చాలా పెద్ద సినిమా’’ అని చెప్పారు.

అలాగే తాజాగా విడుదలైన ప్రీరిలీజ్‌ టీజర్‌పై వస్తున్న కొన్ని నెగెటివ్‌ కామెంట్స్‌ గురించి ఆయన మాట్లాడారు. ‘‘యానిమల్‌’ టీజర్‌ను ఆదరించిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనిపై కొంతమంది కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ టీజర్‌ను మూవీలోని ఎపిసోడ్‌ నుంచే కట్‌ చేశాం కాబట్టి ఆ కంటెంట్‌ అంతా సినిమాలో ఉంటుంది. డిసెంబర్‌ 1న  అందరూ థియేటర్లకు వచ్చి రణ్‌బీర్ కపూర్‌ విశ్వరూపం చూడండి’’ అని సందీప్‌ వంగా కోరారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక తాజాగా దీని ట్రైలర్‌ చూశాక ఆ అంచనాలు రెట్టింపయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని