వాళ్లే నా బలం: నమ్రత

సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేశ్‌బాబు, గౌతమ్‌.. ఈ ముగ్గురు తన బలమని అంటున్నారు నమ్రత. ఈ మేరకు ఆమె కృష్ణ, మహేశ్‌, గౌతమ్‌లకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘ఈ ముగ్గురు నా సూపర్‌ హీరోలు..

Published : 05 Jan 2020 12:23 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేశ్‌బాబు, గౌతమ్‌.. ఈ ముగ్గురు తన బలమని అంటున్నారు నమ్రత. ఈ మేరకు ఆమె కృష్ణ, మహేశ్‌, గౌతమ్‌లకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘ఈ ముగ్గురు నా సూపర్‌ హీరోలు. ఈ ముగ్గురితో నా జీవితం సంపూర్ణమైంది. నా మీద ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ, గౌరవానికి కృతజ్ఞురాలిని. ప్రతిసారీ ఈ ముగ్గురు నాకో కొత్త విషయాన్ని నేర్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వీళ్లే నా బలం.’ అని నమ్రత పేర్కొన్నారు.

మరోవైపు మహేశ్‌ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్‌కు జంటగా రష్మిక నటించారు. దిల్‌రాజు, మహేశ్‌బాబు, అనిల్‌ సుంకర నిర్మాతలుగా వ్యవహిరించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని