Lokesh Kanagaraj: విజయ్‌తో మనస్పర్థలు.. తొలిసారి స్పందించిన లోకేశ్‌ కనగరాజ్

‘లియో’ (Leo) ప్రమోషన్స్‌ షురూ చేశారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj). తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Published : 08 Oct 2023 01:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘లియో’ (Leo) సినిమా విషయంలో నటుడు విజయ్‌కు దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తాయని ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. ఈ కథనాలను ఉద్దేశించి లోకేశ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనన్నారు. ఆ వార్తలు చూసి తానూ విజయ్‌ ఎంతగానో నవ్వుకున్నామన్నారు. ఇప్పటివరకూ ఎంతోమంది స్టార్స్‌తో వర్క్‌ చేసినప్పటికీ కేవలం ఆయన్ని మాత్రమే అన్నా అని పిలుస్తానని.. తమ మధ్య అంతటి అనుబంధం ఉందని చెప్పారు.

Swathi: ఆ వార్తల వల్ల నేనెంతో బాధపడ్డా: స్వాతి

‘‘లియో’ ట్రైలర్‌ను మొదట విజయ్‌కు చూపించా. దాదాపు మూడుసార్లు రిపీట్‌ మోడ్‌లో ట్రైలర్‌ చూశారు. గోదాంలో విలన్స్‌తో విజయ్‌ ఫైట్‌ చేసే సీక్వెన్స్‌ను 20 రోజులు షూట్‌ చేశాం. నాకు తెలిసినంత వరకూ ఇలాంటి ఫైట్‌ సీన్‌ను ఆయన ఇప్పటివరకూ చేయలేదు. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’లో చూపించిన విధంగా ఇందులోనూ ఓ బిర్యానీ సీక్వెన్స్‌ ఉంటుంది’’ అని ఆయన తెలిపారు. ‘ఈ సినిమాకి కమల్‌ హాసన్‌ డబ్బింగ్‌ చెప్పారా?’ అని ప్రశ్నించగా.. ‘‘సినిమా విడుదలయ్యాక మీకే తెలుస్తుంది. ప్రేక్షకులకు ఎంజాయ్‌మెంట్‌ అందించే ఎన్నో విషయాలను సినిమాలు దాచి ఉంచాం’’ అని బదులిచ్చారు.

‘మాస్టర్‌’ తర్వాత విజయ్‌-లోకేశ్‌ కాంబోలో వస్తోన్న చిత్రమిది. మాదకద్రవ్యాలు, స్మగ్లింగ్‌, గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో సాగే కథతో దీనిని తీర్చిదిద్దారు. త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని