Trisha: త్రిషపై మన్సూర్ అలీఖాన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఎన్‌సీడబ్ల్యూ సీరియస్‌

మన్సూర్‌ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మన్సూర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది.

Updated : 20 Nov 2023 16:07 IST

ఇంటర్నెట్‌డెస్క్: నటి త్రిష (Trisha)పై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan) చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. త్రిషపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయని.. మహిళల గురించి ఈ విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని తెలిపింది. ‘‘త్రిష కృష్ణన్‌ను ఉద్దేశించి మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. అతడిపై IPC సెక్షన్ 509 B (ఎలక్ట్రానిక్‌ మీడియంలో లైంగిక ఆరోపణలు)తో ఇతర సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. మహిళలపై హింసను ప్రేరేపించే ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదు’’ అని ఎన్‌సీడబ్ల్యూ ట్వీట్‌ చేసింది.

Mani Ratnam: అక్కడ జరిగే చర్చలు రోడ్‌ సైడ్‌ డిబేట్స్‌లా ఉంటాయి : మణిరత్నం

అసలేం జరిగిందంటే..: మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘లియో’లో త్రిషతో ఓ సీన్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్‌ సీన్లలో నటించా. ‘లియో’లో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్‌ లేకపోవడం బాధగా అనిపించింది’’ అని మన్సూర్‌ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తుందని.. అతడితో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకోనందుకు ఆనందంగా ఉందన్నారు. మరోవైపు, మన్సూర్ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని