Nithiin: నితిన్ కొత్త సినిమా ఆరంభం

కొత్త సినిమాని పట్టాలెక్కించిన నితిన్‌

Published : 03 Apr 2022 14:02 IST

హైదరాబాద్‌: నటుడు నితిన్‌ కొత్త ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీలీలా కథానాయిక. ఆదివారం ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో వెంకీ కుడుముల, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. త్వరలోనే ఈసినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. రొమాంటిక్‌ కామెడీ సన్నీవేశాలతో పాటు హై వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంగా చిత్రం ఉండనుందని సమాచారం. ఇందులో నితిన్‌ పాత్ర ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నితిన్‌ ‘మాచర్ల నియోజక వర్గం’లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని