Animal: అక్కడ ‘బాహుబలి-2’ రికార్డు బ్రేక్‌ చేసిన ‘యానిమల్‌’

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాల్లో రణ్‌బీర్‌ కపూర్‌ తాజా చిత్రం ‘యానిమల్‌’(Animal) చేరింది. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్‌లో ‘బాహుబలి-2’ (Baahubali 2) రికార్డును అధిగమించింది.

Published : 05 Dec 2023 16:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా తెరకెక్కిన సినిమా ‘యానిమల్‌’. డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రణ్‌బీర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మంచి వసూళ్లను సాధిస్తూ రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ‘బాహుబలి-2’(Baahubali 2) రికార్డును ఇది బ్రేక్‌ చేసింది.

‘యానిమల్‌’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్‌లో ఈ చిత్రాన్ని 633 థియేటర్లలో రిలీజ్‌ చేశారు. అక్కడ నాలుగు రోజుల్లోనే ఏకంగా ఏడు లక్షల డాలర్లకు పైగా ఈ చిత్రం రాబట్టింది. దీంతో వసూళ్లలో ‘బాహుబలి-2’ రికార్డును అధిగమించింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-2’ అక్కడ ఐదు లక్షల డాలర్లు వసూళ్లు చేసింది. ఆ రికార్డును సందీప్ వంగా ‘యానిమల్‌’ కేవలం నాలుగు రోజుల్లోనే అధిగమించడం విశేషం. ఇక ఈ ఏడాది ఓవర్సీస్‌లో ఏడు లక్షల డాలర్ల కలెక్షన్స్‌ సాధించిన ఐదో భారతీయ చిత్రంగా ‘యానిమల్‌’ నిలిచింది.

‘డంకీ’ ట్రైలర్‌ రిలీజ్‌.. అర్థం వెతుకుతున్న నెటిజన్లు..

ఇక ‘యానిమల్‌’ ఇప్పటి వరకు మొత్తం రూ.425కోట్ల (గ్రాస్‌) వసూళ్లు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ కలెక్షన్స్‌ ఇలానే కొనసాగితే మరో రెండు రోజుల్లో రూ.500కోట్లు సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రణ్‌బీర్‌ సరసన రష్మిక నటించగా బాబీ దేవోల్ విలన్‌ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని