Rashmika: రష్మిక గురించి ఈ విషయాలు తెలుసుకోవాలంటే.. వీడియో చూడాల్సిందే..!

‘పుష్ప’తో బాలీవుడ్‌లోనూ ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నారు నటి రష్మిక మందన్న. ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తర్వాత నార్త్‌లోనూ ఆమెకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది. దీంతో రష్మిక గురించి ఆసక్తికర విషయాలు....

Published : 11 Mar 2022 01:31 IST

హైదరాబాద్‌: ‘పుష్ప’తో బాలీవుడ్‌లోనూ ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నారు నటి రష్మిక మందన్న. ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తర్వాత నార్త్‌లోనూ ఆమెకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది. దీంతో రష్మిక గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలోనే.. ఇప్పటివరకూ ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాల వేదికగా అభిమానులకు చేరువగా ఉన్న రష్మిక ఇప్పుడు వారికి మరింత దగ్గరకానున్నారు. తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులకు తెలియజేయనున్నారు. అదెలా అనుకుంటున్నారా..? యూట్యూబ్‌ వేదికగా..!

నటి రష్మిక ఫేస్‌బుక్‌ కంటే కూడా ఇన్‌స్టా, ట్విటర్‌లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. తన ఇష్టాయిష్టాలు, అభిరుచులు, కొత్త సినిమాల ప్రచారాలతోపాటు అప్పుడప్పుడూ ఇన్‌స్టా, ట్విటర్‌ వేదికలుగా అభిమానులతో కాస్త సమయంపాటు ముచ్చటించేవారు. ఈ క్రమంలోనే గతేడాది ఆమె యూట్యూబ్‌లోకి అడుగుపెట్టారు. ‘రష్మిక మందన్న’ పేరుతో అధికారిక ఖాతాని ప్రారంభించారు. ఆమె ఈ ఖాతాను నవంబర్‌ 25నే ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకూ ఎలాంటి వీడియోని షేర్‌ చేయలేదు. గురువారం ఉదయం తన ఫస్ట్‌ వీడియోని తాజాగా ఆమె షేర్‌ చేశారు. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. తన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే తన ఛానెల్‌ ఫాలో కావాలని ఆమె కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని