Tillu2: ‘టిల్లు స్వ్కేర్‌’ కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే..

యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) నటిస్తోన్న తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్‌’. దీని రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది.

Published : 27 Oct 2023 12:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ‘డీజే టిల్లు’ (DJ Tillu).. అంటూ గతేడాది సందడి చేశాడు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). అంచనాలకు మించి విజయం సాధించిన ఆ చిత్రం మంచి వసూళ్లనూ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌ తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దాని కొత్త రిలీజ్‌ డేట్‌ను నిర్మాణ సంస్థ  ప్రకటించింది.

సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా  తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్‌ను గతేడాది దీపావళికి ప్రకటించారు. అప్పటి నుంచి ఏదో ఒక అప్‌డేట్‌తో సందడి చేస్తూనే ఉన్నారు. ఇక ఈ చిత్రం 2024 ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాత పోస్ట్‌ పెట్టారు. ‘మరోసారి నవ్వులు పూయిస్తూ చరిత్ర సృష్టించడానికి ‘టిల్లు స్వ్కేర్‌’ (Tillu Square) వచ్చేస్తున్నాడు. మొదటి పార్ట్‌ను మించి వినోదాన్ని పంచనున్నాడు. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు మాస్‌ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోనున్నాడు’ అని తెలిపారు. మొదట ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌ 15న విడుదల చేయాలని భావించారు. అయితే చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.

ఓటీటీలోకి ‘పెదకాపు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

రామ్‌ మల్లిక్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ఈ యంగ్‌ హీరో సరసన కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటిస్తోంది. ఫస్ట్‌ పార్ట్‌లో రాధిక పాత్ర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇక దీనితో పాటు నీరజ కోన దర్శకత్వంలో  సిద్ధు జొన్నలగడ్డ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇటీవలే దీని షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. అలాగే నందినిరెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని