Google Play Store: ప్లేస్టోర్‌లో 2022 బెస్ట్‌ గేమ్‌ను ఎన్నుకునే ఛాన్స్‌ మీదే!

ప్లే స్టోర్‌లో 2022 ది బెస్ట్ గేమ్‌ను ఎన్నుకునేందుకు గూగుల్ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించింది. మరో వారంలో ఈ ఓటింగ్‌ ముగియనుంది. యూజర్లు తమ జీమెయిల్‌ ఐడీతో ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. 

Updated : 05 Nov 2022 12:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా యూజర్స్‌ ఛాయిస్‌ గేమ్‌ (Users Choice Game)కు గూగుల్ ఓటింగ్‌ నిర్వహిస్తోంది. ఇందుకోసం టాప్‌ టెన్ ట్రెండింగ్‌ గేమ్‌ల జాబితాను సిద్ధం చేసింది. యూజర్లు వాటిలో తమకు నచ్చిన యాప్‌కు ఓటేసి ది బెస్ట్‌ గేమ్‌ను ఎంపిక చేయాలి. ఇప్పటికే ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మరో వారంలో ముగుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. కింద యాప్‌ల జాబితాపై ఓ లుక్కేసి, లింక్‌ క్లిక్ చేసి ఓటింగ్‌లో పాల్గొనండి మరి!

యాంగ్రీ బర్డ్స్‌ జర్నీ(Angry Birds Journey)

స్లింగ్‌షాట్ అడ్వెంచర్‌తో యాంగ్రీ బర్డ్స్‌ సిరీస్‌ నుంచి వచ్చిన గేమ్‌. ఇందులో పజిల్‌, బర్డ్‌ రెస్క్యూ వంటి టాస్క్‌లతోపాటు ఫన్‌తో కూడిన ఎన్నో టాస్క్‌లు ఉంటాయి. 

రాకెట్ లీగ్ సైడ్‌స్వైప్‌ (Rocket League Sideswipe)

కారు రేస్‌, ఫుట్‌బాల్‌ గేమ్‌ కలయికగా ఈ గేమ్‌ను డిజైన్‌ చేశారు. ఒకవిధంగా ఈ గేమ్‌ను కారు ఫుట్‌బాల్‌ అని చెప్పొచ్చు. ఇందులో రెండు నిమిషాల కారు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఉంటాయి. స్నేహితులతో కలిసి ఆడుకోవచ్చు. 

బీటీఎస్ ఐలాండ్ (BTS Island: In the SEOM)

స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకునే గేమ్‌. పజిల్స్‌ పరిష్కరించిన వారికి స్టార్స్‌ ఇస్తారు. వాటితో గేమ్‌లో ముందు లెవల్స్‌కు సులువుగా చేరుకోవచ్చు. చూడటానికి ఇది అడ్వెంచర్‌ గేమ్‌లా కనిపించినా.. పజిల్స్‌ క్యాండి క్రష్‌ సాగాలో మాదిరి ఉంటాయి. 

మినీ బాస్కెట్‌బాల్‌ (Mini Basketball)

స్నేహితులు చిన్న చిన్నగ్రూపులుగా విడిపోయి ఆడుకోవచ్చు. సాధారణ బాస్కెట్‌ బాల్‌లో ఉన్నట్లుగా ఇందులో నియమ నిబంధనలు ఉంటాయి. గేమ్‌ ఆడేటప్పుడు బ్యాగ్రౌండ్‌లో ప్రేక్షకులు అరుపులతోపాటు, ఇతర సౌండ్‌లతో నిజమైన గేమ్‌ ఆడుతున్న అనుభూతి కలుగుతుంది. 

అపెక్స్ లెజెండ్స్‌ మొబైల్‌ (Apex Legends Mobile)

అడ్వెంచర్స్‌ ఆధారంగా డిజైన్‌ చేసిన రాయల్‌ షూటర్‌ గేమ్‌ ఇది. శత్రువులను ఎదుర్కొనే నైపుణ్యం ఆధారంగా గేమ్‌లో లెజెండరీ క్యారెక్టర్‌గా మారే అవకాశం వస్తుంది. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి సైన్యంలా ఏర్పడి శత్రువులను ఎదుర్కొవచ్చు. 

డిస్నీ మిర్రర్‌వర్స్‌ (Disney Mirrorverse)

డిస్నీ, పిక్సర్‌ రూపొందించిన క్యారెక్టర్ల ఆధారంగా ఈ గేమ్‌ను డిజైన్‌ చేశారు. ఇందులో ప్లేయర్స్ తమకు నచ్చిన డిస్నీ క్యారెక్టర్లతో టీమ్‌ను ఏర్పాటు చేసుకొని, శత్రువులతో పోరాడాల్సి ఉంటుంది. 

ఫార్‌లైట్ 84 (Farlight 84)

ఫార్‌లైట్‌ 84 కూడా యాక్షన్‌ అడ్వెంచర్‌ గేమ్‌. ఇందులో క్యారెక్టర్లు ఇతర గ్రహాల వారితో పోరాడాలి. యూజర్‌ తనకు నచ్చిన ఆయుధం, వాహనాన్ని ఎంపిక చేసుకొని యుద్దంలో పాల్గొనాలి. 

షాడో ఆఫ్‌ డెత్‌ (Shadow of Death 2: RPG Games)

 కింగ్‌ లూథర్‌ కత్తి కోసం పోరాడే యోధుడిగా యూజర్‌ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశారు. ప్రాచీన యుద్ధ కళల ఆధారంగా ఈ గేమ్‌ను డిజైన్‌ చేశారు. 

డియాబ్లో ఇమ్మోర్టల్‌ (Diablo Immortal)

ఇది కూడా రాయల్ బ్యాటిల్‌ గేమ్. యూజర్‌ తనకు నచ్చిన క్లాసిక్ క్యారెక్టర్‌ను ఎంచుకుని యుద్ధంలో పాల్గొనాలి. డిమాన్స్ ఆర్మీ, లార్డ్‌ ఆఫ్‌ డిస్ర్టక్షన్‌ మధ్య పోరు జరుగుతుంది. 

స్టార్‌ బ్లాస్ట్‌ (Star Blast)

బ్రాడ్‌ అనే క్యారెక్టర్‌ను కాపాడటం ఈ గేమ్ థీమ్‌. ఇందులో పజిల్స్‌ను క్లియర్ చేస్తూ తర్వాతి లెవల్స్‌కు చేరుకోవచ్చు. పజిల్ క్లియర్ చేసిన ప్రతిసారీ యూజర్‌కు బ్రాడ్‌ కొత్త మోషన్‌ పిక్చర్‌ కనిపిస్తుంది. 

బెస్ట్ గేమ్‌కు ఓటేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని