‘ఆ వార్తలు అవాస్తవం’: అమెరికా దర్యాప్తు చేపట్టిందన్న కథనంపై అదానీ గ్రూప్‌ స్పందన

లంచం ఆరోపణల విషయంలో దర్యాప్తు గురించి వెలువడిన మీడియా కథనం అవాస్తవమని అదానీ గ్రూప్‌(Adani Group) వెల్లడించింది. 

Updated : 19 Mar 2024 11:53 IST

ముంబయి: లంచం ఆరోపణల విషయంలో అమెరికా(USA) ప్రభుత్వం దర్యాప్తు చేపట్టిందన్న వార్తలపై అదానీ గ్రూప్‌(Adani Group) స్పందించింది. ఆ మీడియా కథనం అవాస్తవమని వెల్లడించింది. ‘ఆ ఆరోపణలకు సంబంధించి అమెరికా న్యాయశాఖ నుంచి ఎలాంటి నోటీసు అందలేదు’ అని సంస్థ తన ఫైలింగ్‌లో తెలిపింది. ఈ దర్యాప్తు గురించి తమకు తెలియదని, భారత్‌తో సహా ఇతర దేశాల్లోని అవినీతి నిరోధక చట్టాలకు తాము కట్టుబడి ఉన్నామని గ్రూప్‌ పేర్కొంది.

భారత్‌లో ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో అనుకూలంగా వ్యవహరించేలా అదానీ గ్రూప్‌ లేదా ఆ సంస్థలోని వ్యక్తులు ఎవరైనా లంచం ఇవ్వజూపారా? లేదా? అనేది తెలుసుకోవడానికి అమెరికా దర్యాప్తు చేపట్టిందని బ్లూమ్‌బెర్గ్‌ కథనంలో పేర్కొంది. ఆ దేశ అటార్నీ జనరల్‌ ఆఫీస్‌, జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఫ్రాడ్‌ యూనిట్‌ ఈ విచారణ జరపుతున్నట్లు తెలిపింది. దేశీయ ఎనర్జీ కంపెనీ అజ్యూర్‌ పవర్‌ గ్లోబల్‌పైనా దృష్టిపెట్టినట్లు వెల్లడించింది. అమెరికాలో అదానీ గ్రూప్‌ ట్రేడ్‌ కానప్పటికీ.. అమెరికన్ల పెట్టుబడులు దానిలో ఉన్న నేపథ్యంలో అక్కడి సంస్థలు దర్యాప్తు జరిపేందుకు వీలుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని