Airtel: నెలకు రూ.599-1499 అద్దెపై ఎయిర్‌టెల్ కుటుంబ పథకాలు
Airtel: వినియోగించని డేటాను మరుసటి నెలకు బదిలీ చేసుకునే వీలు, డేటాను కుటుంబసభ్యుల మధ్య పంచుకునే అవకాశాన్ని ఈ పథకాలు కల్పిస్తున్నాయి.
దిల్లీ: కుటుంబ సభ్యులు వినియోగించుకునేందుకు అనువుగా వేర్వేరు పోస్ట్‌పెయిడ్ పథకాలను భారతీ ఎయిర్‌టెల్ ఆవిష్కరించింది. నెలకు రూ.599-1499 అద్దెపై (జీఎస్‌టీ అదనం) లభించే ఈ పథకాల్లో అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు 105-320 జీబీ డేటా లభించనుంది. కుటుంబంలోని 2-5 మంది సభ్యులు వినియోగించుకోవచ్చు. వినియోగించని డేటాను మరుసటి నెలకు బదిలీ చేసుకునే వీలు, డేటాను కుటుంబసభ్యుల మధ్య పంచుకునే అవకాశాన్ని ఈ పథకాలు కల్పిస్తున్నాయి. రూ.599 పథకాన్ని ఇద్దరు, రూ.999-1199 పథకాలను నలుగురు, రూ.1499 అద్దెపై అయిదుగురు వాడుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ 6నెలల సభ్యత్వం, ఏడాదిపాటు డిస్నీ-హాట్‌స్టార్, ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ లభిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Rupert Murdoch: ‘ఫాక్స్’ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన రూపర్ట్ మర్దోక్
-
Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్-రే’ చూస్తే షాక్!
-
World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
-
TDP: వైకాపా దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొందాం? టీడీఎల్పీలో చర్చ
-
Flipkart: మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్!