అమెజాన్‌ డెలివరీలో TVS విద్యుత్‌ వాహనాలు.. ఇరు కంపెనీల మధ్య ఒప్పందం

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇకపై వస్తువుల డెలివరీకి విద్యుత్‌ వాహనాలను వినియోగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా టీవీఎస్‌ మోటార్స్‌తో ఒప్పందం కుదర్చుకుంది.

Updated : 09 Nov 2022 14:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇకపై వస్తువుల డెలివరీకి విద్యుత్‌ వాహనాలను వినియోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీవీఎస్‌ మోటార్స్‌తో ఒప్పందం కుదర్చుకుంది. ఇందులో భాగంగా అమెజాన్‌ ఉత్పత్తుల డెలివరీకి టు వీలర్‌, త్రీవీలర్‌ విద్యుత్‌ వాహనాలను వినియోగించనుంది. ఇందుకోసం టీవీఎస్‌కు చెందిన 2, 3 వీలర్‌ విద్యుత్‌ వాహనాలను వినియోగించనుంది.

పర్యావరణంపై ప్రభావం తగ్గించడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని అమెజాన్‌ డైరెక్టర్‌ అభినవ్‌ సింగ్‌ తెలిపారు. 2025 నాటికి 10వేల విద్యుత్‌ వాహనాలను వినియోగించాలన్న కంపెనీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి లక్ష విద్యుత్‌ వాహనాలను వినియోగించాలని అమెజాన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. తమ విజయవంతమైన ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ స్కూటర్‌ పరిధిని వాణిజ్య అవసరాలకు సైతం వినియోగించడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని టీవీఎస్‌ ప్రతినిధి మను సక్సేనా పేర్కొన్నారు. అలాగే, అమెజాన్‌ వ్యాపార విభాగాల్లో ఎక్కడెక్కడ విద్యుత్‌ వాహనాల వినియోగానికి ఆస్కారముంటుందో రెండు కంపెనీలూ పరిశీలించనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని