Rs 2000 notes: రూ.2,000 నోట్ల ఉపసంహరణ.. అమెజాన్‌ కీలక నిర్ణయం

Rs 2000 notes: రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో అమెజాన్‌ తమ డెలివరీ చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 14 Sep 2023 15:40 IST

దిల్లీ: రూ.2,000 నోట్ల (Rs.2000 notes)ను మార్చుకునేందుకు ఆర్‌బీఐ ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 19 నుంచి ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ (COD)’ల చెల్లింపులకు రూ.2,000 నోట్ల (Rs.2000 notes)ను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంగానీ లేదా మార్చుకునేందుకుగానీ సెప్టెంబరు 30 వరకు సమయం ఉన్న విషయం తెలిసిందే.

రూ.2,000 నోట్ల (Rs.2000 notes)ను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చింది. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో వీటిని చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఉపసంహరణ నేపథ్యంలో సెప్టెంబరు 1 నాటికి 90 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇటీవల తెలిపారు. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. తిరిగొచ్చిన రూ.2,000 నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలోనే వచ్చినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని