Bajaj Finance: బజాజ్‌ ఫైనాన్స్‌ డిజిటల్‌ ఎఫ్‌డీ.. వీరికి 8.85% వడ్డీ

Bajaj Finance digital FD: బజాజ్‌ ఫైనాన్స్‌ సంస్థ డిజిటల్‌ ఎఫ్‌డీని తీసుకొచ్చింది. గరిష్ఠంగా 8.85 శాతం వడ్డీని అందిస్తోంది.

Published : 03 Jan 2024 19:58 IST

Bajaj Finance digital FD | దిల్లీ: ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ బజాజ్‌ ఫైనాన్స్‌ (Bajaj Finance) డిజిటల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను (digital FD) ప్రారంభించింది. కంపెనీ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా డిపాజిట్‌ చేసే వారికి గరిష్ఠంగా 8.85 శాతం వడ్డీ చెల్లించనుంది. 2024 జనవరి 2 నుంచి ఈ వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ యాప్‌, వెబ్‌ ద్వారా 42 నెలల ఎఫ్‌డీ చేసే సీనియర్‌ సిటిజన్లకు అత్యధికంగా 8.85 శాతం వడ్డీని బజాజ్‌ ఫైనాన్స్‌ అందిస్తోంది. 60 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారికి గరిష్ఠంగా 8.60 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. రూ.5 కోట్ల వరకు ఫ్రెష్‌ డిపాజిట్లు, రెన్యువల్స్‌పై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. డిజిటల్‌ ఎఫ్‌డీ ద్వారా సులువుగా ఎక్కువ వడ్డీ రేట్లు కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు బజాజ్‌ ఫైనాన్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, ఇన్వెస్ట్‌మెంట్స్‌ హెడ్‌ సచిన్‌ సిక్కా తెలిపారు. 12-60 నెలల కాలవ్యవధులపై ఎఫ్‌డీ పథకాలు అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని