Bajaj Pulsar N150: స్పోర్టీ లుక్‌లో కొత్త పల్సర్‌ N150.. ధర, ఇతర వివరాలివే

Bajaj Pulsar N150 details: బజాజ్‌ ఆటో కొత్త పల్సర్‌ను తీసుకొచ్చింది. పల్సర్‌ ఎన్‌ 150 పేరిట దీన్ని లాంచ్‌ చేసింది.

Published : 26 Sep 2023 18:25 IST

Bajaj Pulsar N150 launched | ఇంటర్నెట్‌ డెస్క్‌: కుర్రకారును ఆకట్టుకునేందుకు బజాజ్‌ ఆటో (Bajaj auto) మరో కొత్త పల్సర్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. పల్సర్‌ N150 (Bajaj Pulsar N150) పేరిట ఈ బైక్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.1.18 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) (Bajaj Pulsar N150 price) కంపెనీ నిర్ణయించింది. గతంలో తీసుకొచ్చిన పీ150కి మరింత స్పోర్టివ్‌ లుక్‌ను జోడించి ఎన్‌ 150గా బజాజ్‌ తీసుకొచ్చింది.

కొత్త పల్సర్‌ ఎన్‌150 (Bajaj Pulsar N150) ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 149.68 సీసీ ఫోర్‌ స్ట్రోక్‌, సింగిల్‌ సిలిండర్‌ FI, ఎయిర్‌కూల్డ్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 14.30 బీహెచ్‌పీని, 13.5 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫైవ్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ అమర్చారు. లీటర్‌కు 45-50 మైలేజీ ఇస్తుందని బజాజ్‌ ఆటో పేర్కొంది. ముందువైపు టెలీస్కోపిక్‌ ఫోర్క్స్‌, వెనుకవైపు మోనోషాక్‌ యూనిట్‌ ఇచ్చారు. ముందు వైపు 240 ఎంఎం డిస్క్‌ బ్రేక్‌, వెనుకవైపు 130ఎంఎం డ్రమ్‌ బ్రేక్‌ ఇస్తున్నారు. సింగిల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ సదుపాయం ఉంది.

గేమింగ్‌ కంపెనీలకు షాక్‌.. ఒక్క డ్రీమ్‌ 11కే ₹25 వేల కోట్ల పన్ను నోటీసు..!

గతంలో పల్సర్‌ విడుదల చేసిన ఎన్‌ 160తో పోలిస్తే కొత్త ఎన్‌ 150 దాదాపు 7 కిలోలు తక్కువ బరువు ఉంటుంది. ఇందులో డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ క్లస్టర్‌ ఇస్తున్నారు. ఫ్యూయల్‌ ట్యాంక్‌పై యూఎస్‌బీ పోర్ట్‌ ఇస్తున్నారు. దీంతో మొబైల్స్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చు. రేసింగ్‌ రెడ్‌, మెటాలిక్‌ పెర్ల్‌ బైట్‌, ఎబోనీ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. బ్లూటూత్‌ కనెక్టవిటీ సదుపాయం లేదు. ఫీచర్ల పరంగా గతంలో లాంచ్‌ చేసిన పల్సర్‌ పీ150కి, దీనికీ పోలిక ఉన్నప్పటికీ.. లుక్‌ పరంగా కొన్ని మార్పులు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని