Gautam Singhania: విడిపోతున్న బిలియనీర్‌ గౌతమ్‌ సింఘానియా దంపతులు

Gautam Singhania: రేమాండ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ సింఘానియా దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. తన భార్య నవాజ్‌తో విడిపోతున్నట్లు సింఘానియా ప్రకటించారు.

Published : 13 Nov 2023 15:05 IST

దిల్లీ: ప్రముఖ బిలియనీర్‌, టెక్స్‌టైల్‌ దిగ్గజం రేమాండ్‌ గ్రూప్‌ (Raymond Group) ఛైర్మన్‌, ఎండీ గౌతమ్‌ సింఘానియా (Gautam Singhania) తన భార్య నవాజ్‌ మోదీ (Nawaz Modi) నుంచి విడిపోతున్నారు. ఈ విషయాన్ని సోమవారం ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. మూడు దశాబ్దాల బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. ఇక నుంచి తాము వేర్వేరు దారుల్లో ప్రయాణించనున్నట్లు తెలిపారు.

‘‘గతంలో మాదిరిగా ఈ దీపావళి ఉండబోదు. 32 ఏళ్లుగా జంటగా కలిసి ప్రయాణం చేసిన మేం ఒకరికొకరం అండగా నిలబడ్డాం. నిబద్ధత, సంకల్పం, విశ్వాసంతో ప్రయాణం చేశాం. మా జీవితాల్లోకి మరో ఇద్దర్ని (పిల్లలను) ఆహ్వానించి తల్లిదండ్రులుగా మారాం. కానీ, ఇటీవల జరిగిన కొన్ని దురదృష్టకర పరిణామాల అనంతరం.. ఇక నుంచి నవాజ్‌, నేను భిన్నమైన దారుల్లో ప్రయాణించాలని భావిస్తున్నా. ఆమె నుంచి నేను విడిపోతున్నా. అయితే తల్లిదండ్రులుగా మా కుమార్తెలు నిహారిక, నీసాకు ఉత్తమ జీవితాన్ని అందించే మా బాధ్యతలను కొనసాగిస్తాం. మా వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించి.. మా గోప్యతను కాపాడండి.’’ అని గౌతమ్‌ సింఘానియా తన పోస్ట్‌లో వెల్లడించారు.

రిమోట్‌ వర్క్‌తో కెరీర్‌కు నష్టమే..!

58ఏళ్ల గౌతమ్ సింఘానియా 1999లో నవాజ్‌ మోదీని వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరూ ఎనిమిదేళ్ల పాటు డేటింగ్‌ చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. నవాజ్‌ మోదీ ప్రొఫెషనల్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా.. రెండేళ్ల క్రితం గౌతమ్‌ సింఘానియా తన తండ్రి విజయ్‌పత్‌తో విభేదాల కారణంగా వార్తల్లో నిలిచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని