Gold: ధన త్రయోదశి వేళ బంగారం కొంటున్నారా? ఏ రూపంలో కొంటే ఎంత పన్ను?
ధనత్రయోదశికి బంగారం కొటే మంచిదని చాలా మంది విశ్వాసం. అందుకే ఈ రోజున ఒక్క గ్రాము బంగారాన్ని అయినా కొనుగోలు చేసేందుకు చూస్తుంటారు. మరి ఏ రూపంలో బంగారం కొంటే ఎంత పన్ను వర్తిస్తుందో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ధన త్రయోదశికి బంగారం కొంటే మంచిదని చాలా మంది విశ్వాసం. అందుకే ఆ రోజు ఒక్క గ్రాము బంగారాన్ని అయినా కొనుగోలు చేసేందుకు చూస్తుంటారు. ఈ పండగల వేళ ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని విక్రయాలను పెంచుకునేందుకు నగల వ్యాపారులు సైతం బంగారంపై అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ఈ ఆఫర్లతో చాలా మంది ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే, బంగారాన్ని ఆభరణాల రూపంలోనే కాకుండా డిజిటల్‌గానూ, బాండ్ల రూపంలోనూ కొనుగోలు చేయొచ్చు. ఏ రూపంలో బంగారం కొనుగోలు చేయాలనేది.. మీరు ఎందుకోసం బంగారం కొనుగోలు చేస్తున్నారనేదానిపై ఆధారపడి ఉంటుంది. సొంత వినియోగం కోసం అయితే నగల రూపంలో కొనుగోలు చేయొచ్చు. పెట్టుబడుల కోసం అయితే మాత్రం సార్వభౌమ పసిడి పథకాలు, గోల్డ్ ఈటీఎఫ్ వంటివి పరిశీలించడం మంచిది. ఏదేమైనా బంగారంలో పెట్టుబడులపై ఆదాయపు పన్ను వర్తిస్తుంది. మరి ఏ రూపంలో బంగారం కొంటే ఎంత పన్ను వర్తిస్తుందో తెలుసా?
మూలధన రాబడి..
ఆదాయపు పన్ను విషయానికి వస్తే.. బంగారం విక్రయించినప్పుడు వచ్చే మూలధన రాబడిపై పన్ను వర్తిస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. స్వల్పకాలిక మూలధన రాబడి, దీర్ఘకాలిక మూలధన రాబడి. బంగారం కొనుగోలు చేసిన మూడేళ్ల (36 నెలలు)లోపు విక్రయిస్తే.. దానిపై వచ్చే రాబడిని స్వల్పకాలిక మూలధన రాబడి (ఎస్‌టీసీజీ) అంటారు. మూడేళ్ల తర్వాత విక్రయిస్తే దీర్ఘకాల మూలధన రాబడి (ఎల్‌టీసీజీ)గా లెక్కిస్తారు.
భౌతిక బంగారం..
బంగారు నాణేలు, బిస్కెట్లు, ఆభరణాలు రూపంలో భౌతిక బంగారం లభ్యమవుతుంది. నాణేలు, బిస్కెట్ల రూపంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఆభరణాల రూపంలో 22 క్యారెట్ల బంగారం లభిస్తుంది. భౌతిక బంగారాన్ని విక్రయించేటప్పుడు స్వల్పకాల మూలధన రాబడిని పన్ను చెల్లింపుదారుని ఆదాయానికి చేర్చి, వర్తించే స్లాబు ప్రకారం పన్ను లెక్కిస్తారు. దీర్ఘకాల మూలధన రాబడిపై 20% (సెస్‌తో కలిపి) పడుతుంది. ఇండెక్సేషన్ ప్రయోజనాలు వర్తిస్తాయి.
మూలధన రాబడిపై పన్ను వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. బంగారం కొనుగోలు, విక్రయించే వ్యాపారులకు వర్తించదు. ఇలాంటి వారు బంగారం అమ్మినప్పుడు వచ్చిన రాబడిని వ్యాపారంపై వచ్చిన ఆదాయంగా పరిగిణించి దాని ప్రకారం పన్ను విధిస్తారు. అలాగే భౌతిక బంగారం కొనుగోళ్లపై 3% జీఎస్‌టీ, తయారీ ఛార్జీలపై 5% జీఎస్‌టీ వర్తిస్తుంది.
గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్లు..
గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్‌ఛేంజీల్లో ట్రేడ్ అవుతాయి. ఒక గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్, 1 గ్రాము బంగారంతో సమానం. వీటిపై వచ్చిన మూలధన రాబడిపై ఫిజికల్ గోల్డ్‌కు వర్తించినట్లుగానే పన్ను వర్తిస్తుంది.
డిజిటల్ గోల్డ్..
మొబైల్ వ్యాలెట్ల నుంచి కొనుగోలు చేసే బంగారాన్ని డిజిటల్ గోల్డ్‌గా పిలుస్తారు. దీనిపై కూడా ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే పన్నులు (జీఎస్టీ, మూలధన పన్నులు) వర్తిస్తాయి.
సావరిన్ బాండ్లు..
సార్వభౌమ పసిడి బాండ్లు.. ప్రభుత్వ సెక్యూరిటీలు. ఒక యూనిట్, ఒక గ్రాము బంగారంతో సమానం. ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. మెచ్యూరిటీ గడువు 8 సంవత్సరాలు. ఐదో సంవత్సరం తర్వాత ప్రీమెచ్యూర్ విత్‌డ్రాలను అనుమతిస్తారు. మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తే మూలధన రాబడిపై పన్ను ఉండదు. ఒకవేళ మెచ్యూరిటీ కంటే ముందే (ఐదేళ్ల తర్వాత) విత్‌డ్రా చేసుకుంటే దీర్ఘకాల మూలధన రాబడిపై 20% పన్ను (ఇండెక్సేషన్ ప్రయోజనంతో) వర్తిస్తుంది.
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్..
బంగారం దిగుమతులను తగ్గించేందుకు, ఇళ్లలో వృథాగా ఉన్న బంగారాన్ని వాడుకలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని 2015లో ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఎవరైనా తమ బంగారాన్ని డిపాజిట్ చేయొచ్చు. వడ్డీ కూడా లభిస్తుంది. ఈ పథకంలో పాత బంగారం డిపాజిట్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పన్ను ప్రయోజనాలను అందిస్తోంది. మూలధన రాబడిపై కూడా పన్ను వర్తించదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడిపై హత్యాయత్నం
-
Ap-top-news News
Andhra News: ఇసుక కోసం.. నదిలోనే అడ్డంగా దారి
-
Politics News
Nitish Kumar: కేసీఆర్ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: నీతీశ్‌కుమార్
-
India News
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో ‘ఛోటా రాహుల్’!
-
Ap-top-news News
Andhra News: మా భూమిని లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా..సెల్ఫీ వీడియో తీసి యువరైతు అదృశ్యం
-
Ap-top-news News
Andhra News: భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు!