Investments: డిపాజిట్ రేట్లు పెరిగాయ్.. చిన్న పొదుపు పథకాల్లో ఏది మేలు?
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ రెపోరేటును పెంచింది. అందుకు అనుగుణంగా బ్యాంకులు డిపాజిట్ రేట్లను సైతం పెంచాయి. మరి చిన్న పొదుపు పథకాల్లో ఏవి మంచి రాబడినిస్తున్నాయో చూద్దాం..!
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వం వరుసగా రెండో త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల (Small Savings Schemes)పై వడ్డీ రేట్లను పెంచింది. ఇవి 20 నుంచి 110 బేసిస్ పాయింట్ల (bps) మధ్య పెరిగి 4.0 శాతం నుంచి 7.6 శాతం వరకు చేరుకున్నాయి. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)’ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే లక్ష్యంతో మే 2022 నుంచి రెపో రేటును 225 బీపీఎస్ పెంచిన నేపథ్యంలో డిపాజిట్ రేట్లు సైతం పెరుగుతున్నాయి. చిన్న పొదుపు పథకాల రేట్లు ముందుగా నిర్వచించిన సూత్రం ఆధారంగా మార్కెట్‌కు అనుసంధానమై ఉంటాయి. సెప్టెంబరులో విడుదల చేసిన చివరి ద్రవ్య విధాన నివేదిక ప్రకారం ఈ రేట్లు సూత్రం ఆధారిత రేట్ల కంటే 44- 77 bps తక్కువగా ఉన్నాయి. అందువల్లే డిపాజిట్ రేట్ల పెంపు అనివార్యమైంది.
వీటిలోనే గరిష్ఠ పెంపు..
డిపాజిట్ రేట్లు అత్యధికంగా ఒక ఏడాది, రెండు సంత్సరాలు, మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై పెరిగాయి. అంతకంటే తక్కువ గడువు గల డిపాజిట్లు రేపో రేటుపై ఆధారపడి ఉంటాయి. అలాగే మూడేళ్ల కంటే ఎక్కువ కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేటు ప్రభుత్వ సెక్యూరిటీల వంటి మార్కెట్ సాధనాలపై ఆధారపడి ఉంటుంది. రెపోరేటు 225 బీపీఎస్ పెరిగిన నేపథ్యంలో డిపాజిట్ రేట్ల పెరుగుదల అత్యధికంగా తక్కువ గడువు ఉన్న డిపాజిట్లపైనే ఉంటుంది.
దేంట్లో రాబడి ఎక్కువ?
డిపాజిట్ రేట్లు పెరిగిన నేపథ్యంలో సురక్షిత మదుపు మార్గాల్లో ఏది ఆకర్షణీయమైన రాబడినిస్తోందనే ప్రశ్న తలెత్తుతోంది? ‘సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)’లో ప్రస్తుతం 8 శాతం వడ్డీరేటు లభిస్తోంది. మిగిలిన చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో దాదాపు అన్నింట్లో 7 శాతానికి కొంచెం అటుఇటుగా ఉంది. ద్రవ్యోల్బణం 6 శాతానికి దిగువకు చేరింది. సమీప భవిష్యత్తులో అనూహ్యంగా పెరిగే సూచనలు కూడా లేవని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్న పొదుపు పథకాలన్నీ ప్రస్తుతం ఆకర్షణీయమైన రాబడినే ఇస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, పన్నును పరిగణనలోకి తీసుకుంటే ఫలితం మారొచ్చు. కాబట్టి మదుపర్లు ఏ పన్ను శ్లాబులోకి వస్తారనేది కూడా ఇక్కడ ముఖ్యమైన అంశం. దిగువ పన్ను శ్లాబుల్లో ఉన్నవారికి ఎస్సీఎస్ఎస్ మెరుగైన రాబడినిస్తుందని నిపుణుల సూచన.
వీటి మాటేంటి?..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) రేట్లు మాత్రం మారలేదు. ఇవి వరుసగా 7.1 శాతం, 7.6 శాతంగా కొనసాగుతున్నాయి. అయితే, ఇవి ఆకర్షణీయం కాదని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఇవి దీర్ఘకాల పెట్టుబడి సాధనాలు. వీటికి రెపోరేటుతో సంబంధం లేదు. పైగా పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాల లక్ష్యాల సాధన, రిడెమ్షన్ ప్రక్రియ.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే పీపీఎఫ్, ఎస్ఎస్వై ఎప్పటికీ ఆకర్షణీయమే అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
పోస్టాఫీస్ V/S బ్యాంకులు..
పోస్టాఫీస్, బ్యాంకులు.. ఈ రెండింటిలో ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీరేటు దాదాపు ఒకేరకంగా ఉంటుంది. ఏమైనా వ్యత్యాసం ఉన్నా 0.1- 0.3 శాతం వరకే పరిమితమవుతుంది. అయితే, బ్యాంకుల్లో డిపాజిట్ కాలపరిమితి ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుంది. పోస్టాఫీసులు మాత్రం ఒకటి, రెండు, మూడు, ఐదు సంవత్సరాల గడువుతో మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. పోస్టాఫీసు ఎఫ్డీలను ఆరు నెలలు గడిచిన తర్వాత మాత్రమే ముందస్తు ఉపసంహరణకు వీలుంటుంది. ఈ విషయంలో బ్యాంకులు మాత్రం కొంత వెసులుబాటు కల్పిస్తాయి. మరోవైపు పోస్టాఫీసుల్లో వడ్డీ వార్షిక ప్రాతిపదికన చెల్లిస్తారు. బ్యాంకుల్లో మాత్రం నెల, త్రైమాసికం, అర్ధవార్షికం, ఏడాది.. ఇలా కస్టమర్లకు వెసులుబాటు ఉంటుంది. అయితే, మూడు, ఐదేళ్ల కాలపరిమితి గల ఎఫ్డీలు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీసుల్లోనే ఆకర్షణీయంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక డెట్ మ్యూచువల్ ఫండ్లతో పోలిస్తే తక్కువ పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చేవారికి చిన్న పొదుపు పథకాలే మేలని నిపుణుల సూచన. అదే ఎగువ పన్ను శ్లాబు వర్తించేవారు దీర్ఘకాలంలో డెట్ ఫండ్లలో మదుపు చేయడం వల్ల ఇండెక్సేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. పైగా వాటిని విక్రయించే వరకు ఎలాంటి పన్ను వర్తించదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఆర్డీలపై వివిధ బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీ రేట్లు ఇవే..
దేశంలో దాదాపు అన్ని బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ అందిస్తున్నాయి. ఈ ఆర్డీలపై వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఇక్కడ చూడండి. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
గృహ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇవే..
మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్నవారికి, ఇంటి రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూడొచ్చు. -
క్రెడిట్ కార్డు బాధ్యతగా వాడండి
మీ జేబులో ఉన్న క్రెడిట్ కార్డు.. ఒక అద్భుతమైన ఆర్థిక సాధనం. చేతిలో డబ్బు లేకపోయినా కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని మీరు సరైన మార్గంలో ఉపయోగిస్తే.. అది మీ కోసం ఎన్నో పనులు చేస్తుంది. -
ఎఫ్డీ రేట్లు పెంచిన బజాజ్ ఫైనాన్స్.. వారికి 8.85% వరకు వడ్డీ
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 8.85 శాతం, సాధారణ పౌరులకు 8.6 శాతం వడ్డీ అందిస్తోంది. -
‘అమృత్ కలశ్’ గడువు మరోసారి పెంపు.. ఎప్పటి వరకంటే?
SBI news: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ‘అమృత్ కలశ్’ డిపాజిట్ పథకం గడువును మరోమారు పొడిగించింది. -
విదేశీ విద్యా రుణాలు, వివిధ అంశాల గురించి తెలుసుకోండి?
విద్యార్థులు విదేశీ చదువుకు..రుణ సంస్థల నుంచి పొందే ఆర్థిక సహాయంతో పాటు కొన్ని ముఖ్యమైన ఇతర అంశాల గురించి తెలుసుకోవాలి, అవేంటో ఇక్కడ చూడండి. -
రుణాలు.. తొందరగా తీర్చేద్దాం
అవసరానికి అప్పు చేయడం కొన్నిసార్లు తప్పకపోవచ్చు. తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేయడమే ఆర్థిక క్రమశిక్షణ. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు.. ఇలా సులభంగా రుణం దొరికే మార్గాలున్న రోజుల్లో మన వద్ద లేని డబ్బును ఖర్చు చేసేప్పుడు ఆలోచించాల్సిందే. -
రూపే కార్డు వాడుతున్నారా? యూపీఐ యాప్ ద్వారా ఇక EMIగా మార్చుకోవచ్చు!
రూపే క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. యూపీఐ యాప్‌లో త్వరలో కొన్ని కొత్త ఫీచర్లు పలకరించబోతున్నాయి. -
బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందజేస్తున్నాయి. -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
Flash Pay: కీ చైన్‌తో పేమెంట్స్.. ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫ్లాష్ పే
Federal Bank flash pay: ఫెడరల్ బ్యాంక్ స్మార్ట్ కీ చైన్‌ను తీసుకొచ్చింది. కాంటాక్ట్ లెస్ పేమెంట్ల కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. -
పిల్లల పేరిట ఎఫ్డీ
పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు -
సిబిల్ నివేదికలో తప్పులుంటే
రుణం తీసుకోవాలంటే.. బ్యాంకులు ముందుగా పరిశీలించేది క్రెడిట్ నివేదికనే. ఇందులో ఎలాంటి తప్పులూ దొర్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు రుణం కోసం వెళ్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. -
Personal Loans: వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్?
ప్రస్తుతం అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంతో ఇక్కడ చూద్దాం... -
Home loan: జీరో ప్రాసెసింగ్ ఫీజు.. 8.3% వడ్డీకే హోమ్‌లోన్
Bank of India home loan offer: బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజు సైతం రద్దు చేసింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. -
ప్రత్యేక ఎఫ్డీలను ప్రారంభించిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు పొందొచ్చు.