ITR filing: కంపెనీల ఐటీఆర్‌ ఫైలింగ్‌ డెడ్‌లైన్‌ పొడిగింపు

గత ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీలకు సంబంధించిన ఐటీఆర్‌ దాఖలు గడువును కేంద్ర ఆర్థిక శాఖ పొడిగించింది.

Published : 26 Oct 2022 19:36 IST

దిల్లీ: గత (2021-22) ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీలకు సంబంధించిన ఐటీఆర్‌ దాఖలు గడువును కేంద్ర ఆర్థిక శాఖ పొడిగించింది. అక్టోబర్‌ 31తో గడువు ముగియనుండగా.. నవంబర్‌ 7 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆడిట్‌ రిపోర్టులు సమర్పించడానికి ఉన్న డెడ్‌లైన్‌ను సైతం గత నెలలో 7 రోజుల పాటు సీబీడీటీ పొడిగించింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లు సమర్పించడానికి జులై 31తో గడువు ముగిసిన సంగతి తెలిసిందే. గడువు పొడిగించాలని పన్ను చెల్లింపుదారుల నుంచి వినతులు వచ్చినప్పటికీ గడువును పొడిగించకపోవడం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని