జియో రూ.14000 కోట్లు.. ఎయిర్‌టెల్‌ రూ.5500 కోట్లు

5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్‌ జియోఇన్ఫోకామ్‌ రూ.14,000 కోట్ల ముందస్తు నగదు జమ(ఈఎమ్‌డీ) చేసింది. భారతీ ఎయిర్‌టెల్‌ రూ.5,500 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.2200 కోట్లు; అదానీ డేటా నెట్‌వర్క్స్‌ రూ.100 కోట్ల మేర జమ చేసినట్లు టెలికాం విభాగం(డాట్‌) తెలిపింది. భారీమొత్తం

Published : 19 Jul 2022 04:32 IST

అదానీ రూ.100 కోట్లు

5జీ స్పెక్ట్రమ్‌ కోసం ముందస్తు చెల్లింపులు

దిల్లీ: 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్‌ జియోఇన్ఫోకామ్‌ రూ.14,000 కోట్ల ముందస్తు నగదు జమ(ఈఎమ్‌డీ) చేసింది. భారతీ ఎయిర్‌టెల్‌ రూ.5,500 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.2200 కోట్లు; అదానీ డేటా నెట్‌వర్క్స్‌ రూ.100 కోట్ల మేర జమ చేసినట్లు టెలికాం విభాగం(డాట్‌) తెలిపింది. భారీమొత్తం చెల్లించిన జియోకు 1,59,830 అర్హత పాయింట్లు, ఎయిర్‌టెల్‌కు 66,330; వొడాఫోన్‌ ఐడియాకు 29,370; అదానీ డేటా నెట్‌వర్క్స్‌కు 1650 పాయింట్లు లభించాయి. భారీ ఈఎమ్‌డీ చెల్లించిన రిలయన్స్‌, ఈనెల 26 నుంచి జరిగే వేలంలో స్పెక్ట్రమ్‌ కోసం ఎక్కువ స్థాయిలో బిడ్డింగ్‌లు వేయవచ్చు. అదానీ గ్రూప్‌ తన ప్రైవేటు నెట్‌వర్క్‌ (విమానాలు, విద్యుత్‌ప్లాంట్లు, పోర్టులు, డేటా సెంటర్లు)కు కావాల్సిన కనీస స్పెక్ట్రమ్‌ను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

తద్వారా టెలికాం వినియోగదారు సేవల్లోకి రావడం లేదని స్పష్టం చేసినట్లయింది. ఈ నెల 26న ప్రారంభమయ్యే వేలంలో కనీసం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి పెట్టనున్నారు.  

టెల్కోలకు విద్యుత్‌ టారిఫ్‌ తగ్గించండి: డీఐపీఏ

టెలికాం కంపెనీలకు విధిస్తున్న విద్యుత్‌ టారిఫ్‌ను సమీక్షించాల్సిందిగా విద్యుత్‌ కార్యదర్శి అలోక్‌ కుమార్‌కు, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌(డీఐపీఏ) విజ్ఞప్తి చేసింది. 5జీ నెట్‌వర్క్‌ అమలు కోసం ఎక్కువ మూలధన వ్యయాలను పెడుతున్న నేపథ్యంలో టెల్కో సేవల వ్యయాలు పెరగొచ్చని, అందువల్ల విద్యుత్‌ టారిఫ్‌ సవరించి కంపెనీలపై భారం తగ్గించాలని కోరింది. 2023 కల్లా టెలికాం టవర్ల సంఖ్య 12 లక్షలకు, ఆ తర్వాత ఏడాది 15 లక్షలకు చేరొచ్చనీ డీఐపీఏ పేర్కొంది. 5జీ ఆవిష్కరణతో అదనంగా పలు చిన్న సెల్‌ టవర్లు రావొచ్చని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని