అలా చేస్తే కంపెనీలు విఫలం

పెద్ద ఐటీ కంపెనీల్లో చేరి, తమ జీవితాలను ఉద్యోగంపైనే వెచ్చించే రోజులు ఎపుడో పోయాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, నైపుణ్యాభివృద్ధి సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ‘మూన్‌లైటింగ్‌’ పై చర్చ జరుగుతున్న తరుణంలో

Published : 24 Sep 2022 02:42 IST

మూన్‌లైటింగ్‌పై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

దిల్లీ: పెద్ద ఐటీ కంపెనీల్లో చేరి, తమ జీవితాలను ఉద్యోగంపైనే వెచ్చించే రోజులు ఎపుడో పోయాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, నైపుణ్యాభివృద్ధి సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ‘మూన్‌లైటింగ్‌’ పై చర్చ జరుగుతున్న తరుణంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శుక్రవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ‘సొంతంగా అంకురాలు ఏర్పాటు చేయకూడదంటూ ఉద్యోగులపై ఆంక్షలు విధించే కంపెనీల చర్యలు విఫలమవుతున్నాయ’ని అన్నారు. ఒకే సారి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడాన్ని ఐటీ పరిభాషలో ‘మూన్‌లైటింగ్‌’ అంటారన్న సంగతి తెలిసిందే. ‘ఈ తరం యువకులకు ఆత్మ విశ్వాసం మెండుగా ఉంది. తమకు ఏం కావాలో అదే చేస్తున్నారు. వారిని సొంత అంకురం పెట్టకుండా కంపెనీలు చేసే యత్నాలు సాగడం లేద’న్నారు. అయితే మూన్‌లైటింగ్‌ వల్ల కాంట్రాక్టు షరతుల ఉల్లంఘనలను జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అంగీకరించారు. భారతీయ యువ ఐటీ సిబ్బంది ఆలోచనలు మారుతున్నాయని కంపెనీలైతే అర్థం చేసుకోవాలన్నారు. న్యాయవాదులు, కన్సల్టెంట్ల తరహాలోనే భవిష్యత్‌లో పలు ప్రాజెక్టులు చేపట్టే పనులు ఉంటాయని ఆయన అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని