Forbes List: అత్యంత శక్తిమంతుల్లో నిర్మలా సీతారామన్
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల్లో మనదేశం నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు మరో అయిదుగురికి చోటు దక్కింది.
కిరణ్ మజుందార్ షా, ఫల్గుణి, రోష్ని, మాధబి, సోమామండల్‌కూ చోటు
ఫోర్బ్స్ జాబితా
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల్లో మనదేశం నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు మరో అయిదుగురికి చోటు దక్కింది. ఫోర్బ్స్ ప్రకటించిన ‘ద వరల్డ్స్ 100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్’ వార్షిక జాబితాలో బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా, నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్, హెచ్‌సీఎల్ ఛైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా, సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్, సెయిల్ ఛైర్ పర్సన్ సోమా మండల్ కూడా చోటు దక్కించుకున్నారు.
* సీతారామన్ వరుసగా నాలుగో సారి ఈ జాబితాలో చోటుచేసుకున్నారు. 2019లో 34; 2020లో 41; 2021లో 37 ర్యాంకు సాధించిన ఈమె తాజాగా 36వ స్థానంలో నిలిచారు.
* జాబితాలో 39 మంది సీఈఓలు; 10 మంది ప్రభుత్వ శాఖల అధిపతులు; 11 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం సంపద 115 బిలియన్ డాలర్లుగా ఉంది.
* ఉక్రెయిన్ యుద్ధ సమయంలో నాయకత్వం వహించడం; కరోనా మహమ్మారి అదుపునకు చర్యలు తీసుకోవడం వంటి కారణాల రీత్యా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డే రెండో స్థానంలో; అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ జాబితాలో మూడో స్థానం పొందారు.
* 100వ ర్యాంకులో ఇరాన్‌కు చెందిన జినా ‘మహ్సా’ ఆమిని నిలిచారు. మహిళా హక్కుల కోసం పోరాడిన ఈమె సెప్టెంబరులో మరణించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్‌సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Ap-top-news News
తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!