వాణిజ్య పద్మాలు

భారత ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పద్మ అవార్డుల్లో వాణిజ్య ప్రముఖులు ముగ్గురికి చోటు లభించింది.

Published : 26 Jan 2023 02:32 IST

భారత ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పద్మ అవార్డుల్లో వాణిజ్య ప్రముఖులు ముగ్గురికి చోటు లభించింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా (55)ను ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ అవార్డు వరించింది. కార్పొరేట్‌ సంస్థ అధిపతే అయినా, దాతృత్వ కార్యక్రమాల్లో, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ నైపుణ్యాల్లోనూ ఆయన సుపరిచితుడు. బిట్స్‌ పిలానీ ఛాన్సలర్‌గా, ఐఐఎం అహ్మదాబాద్‌ ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఫోర్బ్స్‌ ప్రకారం.. 2022 అక్టోబరుకు ఆయన సంపద 14 బి.డాలర్లు (దాదాపు రూ.1.10 లక్షల కోట్లు). తండ్రి ఆదిత్య విక్రమ్‌ బిర్లా మరణంతో 1995లో ఆయన ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌గా పగ్గాలు చేపట్టారు. అప్పటికి ఆయన వయసు 28 ఏళ్లు మాత్రమే. 1995లో 2 బిలియన్‌ డాలర్లుగా ఉన్న గ్రూప్‌ వార్షిక టర్నోవర్‌.. ప్రస్తుతం 60 బిలియన్‌ డాలర్లకు చేరింది. 6 ఖండాల్లోని 36 దేశాలకు విస్తరించిన బిర్లా గ్రూప్‌లో 1.40 లక్షల మంది ఉద్యోగులున్నారు.

* ప్రఖ్యాత పెట్టుబడిదారుడు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (మరణానంతరం), రస్నా వ్యవస్థాపకులు అరీజ్‌ ఖంబట్ట (మరణానంతరం) లకు పద్మశ్రీ అవార్డును ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని