వేతన కోతకు సుందర్‌ పిచాయ్‌ సిద్ధం!

గూగుల్‌ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వేతన కోతకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Published : 30 Jan 2023 06:47 IST

దిల్లీ: గూగుల్‌ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వేతన కోతకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల గూగుల్‌ ఉద్యోగులతో జరిగిన టౌన్‌ హాల్‌ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్థాయి ఉద్యోగుల వార్షిక బోనస్‌లో గణనీయమైన కోత ఉంటుందని తెలిపారు. అయితే ఎంత మేర వేతన కోత ఉంటుందో లేదా ఎంత కాలం కొనసాగుతుందన్న అంశాలను పిచాయ్‌ ప్రస్తావించలేదు. కంపెనీ పనితీరుకు ఆయన పారితోషికం అనుసంధానమై ఉండటంతో పిచాయ్‌ కూడా వేతనంలో కోత విధించుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని