బీపీసీఎల్‌ ఆదాయం రూ.1.33 లక్షల కోట్లు

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) డిసెంబరు త్రైమాసికంలో రూ.1,747.01 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 కాల లాభం రూ.2,758.89 కోట్లతో పోలిస్తే ఇది 36.67% తక్కువ.

Published : 31 Jan 2023 02:26 IST

దిల్లీ: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) డిసెంబరు త్రైమాసికంలో రూ.1,747.01 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 కాల లాభం రూ.2,758.89 కోట్లతో పోలిస్తే ఇది 36.67% తక్కువ. ఆదాయం రూ.1,17,497.69 కోట్ల నుంచి 13.48% పెరిగి రూ.1,33,347.51 కోట్లకు చేరింది. 2022 డిసెంబరు 31తో ముగిసిన 9 నెలల కాలానికి కంపెనీ విక్రయాలు 36.01 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇవి 30.69 మి.మె.టన్నులే. విమాన ఇంధన అమ్మకాలు 71.77%, హెచ్‌ఎస్‌డీ-రిటైల్‌ 28.50% శాతం, ఎంఎస్‌-రిటైల్‌ విక్రయాలు 19.97% పెరగడమే దీనికి కారణమని బీపీసీఎల్‌ పేర్కొంది. 9 నెలలకు సరాసరి స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ (జీఆర్‌ఎం) బ్యారెల్‌కు 20.08 డాలర్లుగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇది 6.98 డాలర్లు మాత్రమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని