ప్యాకేజింగ్‌ పరిశ్రమతో జిల్లా స్థాయిలో ఉద్యోగాలు

ప్యాకేజింగ్‌ పరిశ్రమ 15-17 శాతం వృద్ధితో ముందుకెళుతోందని.. దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను సృష్టించే సత్తా ఈ రంగానికి ఉందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.

Published : 19 Mar 2023 01:28 IST

పరిశ్రమ వర్గాల అంచనాలు

దిల్లీ: ప్యాకేజింగ్‌ పరిశ్రమ 15-17 శాతం వృద్ధితో ముందుకెళుతోందని.. దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను సృష్టించే సత్తా ఈ రంగానికి ఉందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని వారంటున్నారు. స్థానిక స్థాయిలో ఉద్యోగాలను సృష్టించడానికి ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ కింద ప్రతీ జిల్లాలో ప్యాకేజింగ్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలని అంటున్నారు. ‘ప్రస్తుతం అన్ని వస్తువుల ప్యాకేజింగ్‌కు గిరాకీ పెరుగుతోంది. అందువల్ల ఈ రంగంలో ఉపాధికి ఎక్కువ అవకాశం ఉంద’ని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌(ఐఐపీ) దిల్లీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ తన్వీర్‌ ఆలమ్‌ శనివారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ప్రపంచంలో ప్యాకేజింగ్‌ వ్యాపారానికి 79 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.6.5 లక్షల కోట్లు) స్థాయి ఉందని.. ఇది 15-17% మేర వృద్ధిని నమోదు చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయని గుర్తుచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు