అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ విస్తరణపై వెనకడుగు లేదు

అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ విస్తరణ వేగంలో రెండో ఆలోచనేమీ లేదని.. ప్రభుత్వానికి సమర్పించిన ప్రణాళికల ప్రకారమే పెట్టుబడులు కొనసాగుతాయని కంపెనీ సీఈఓ అరుణ్‌ బన్సాల్‌ స్పష్టం చేశారు.

Published : 23 Mar 2023 01:41 IST

సీఈఓ అరుణ్‌ బన్సాల్‌

దిల్లీ: అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ విస్తరణ వేగంలో రెండో ఆలోచనేమీ లేదని.. ప్రభుత్వానికి సమర్పించిన ప్రణాళికల ప్రకారమే పెట్టుబడులు కొనసాగుతాయని కంపెనీ సీఈఓ అరుణ్‌ బన్సాల్‌ స్పష్టం చేశారు. అదానీ గ్రూప్‌ ఇటీవలి కాలంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. డొల్ల కంపెనీలను వినియోగించి తమ కంపెనీల షేర్ల ధరలు భారీగా పెరిగేలా చేయడంతో పాటు, కంపెనీల పద్దుల్లోనూ అవకతవకలకు అదానీ గ్రూప్‌ పాల్పడ్డట్లు జనవరిలో అమెరికాకు చెందిన  హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌ చెల్లించాల్సిన రూ.2.3 లక్షల కోట్ల రుణాలపైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే విమానాశ్రయ వ్యాపారంలో పెట్టుబడులు లేదా విస్తరణ వేగం అంశంలో పునరాలోచన ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘లేదు. మేం ప్రభుత్వానికి ఇచ్చిన ప్రణాళికలకు కట్టుబడి ఉన్నాం. పెట్టుబడులను కొనసాగిస్తామ’ని బుధవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో అరుణ్‌ బన్సాల్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని