యాపిల్‌లో లేఆఫ్‌లా.. ఇప్పట్లో ఉండవ్‌

ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు విధిస్తున్నాయి. కానీ, యాపిల్‌ మాత్రం ఇప్పటి వరకు ఉద్యోగుల తొలగించే అంశంపై  ఎలాంటి ప్రకటన చేయలేదు.

Published : 09 May 2023 03:13 IST

సీఈఓ టిమ్‌ కుక్‌

కాలిఫోర్నియా: ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు విధిస్తున్నాయి. కానీ, యాపిల్‌ మాత్రం ఇప్పటి వరకు ఉద్యోగుల తొలగించే అంశంపై  ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా లేఆఫ్‌ల గురించి యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ స్పందిస్తూ ‘అన్ని దార్లు మూసుకుపోయిన తరుణంలో చివరి అంశంగా మాత్రమే లేఆఫ్‌ల గురించి ఆలోచిస్తామ’ని స్పష్టం చేశారు. యాపిల్‌ కంపెనీ రిటైల్‌ విభాగంలో ఇటీవల కొద్ది మంది ఉద్యోగులను తొలగిస్తారనే వార్తలు వెలువడడంతో ఉద్యోగుల్లో లేఆఫ్‌లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో టిమ్‌ కుక్‌ ప్రకటన ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించినట్లయింది. మరోవైపు ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునే విషయంలో కంపెనీ తెలివిగా వ్యవహరిస్తుందని కుక్‌ అన్నారు. ‘ప్రస్తుతం అందరు మాట్లాడుతున్నట్లుగా లేఆఫ్‌లు ఇప్పట్లో ఉండకపోవచ్చు. కానీ లేఆఫ్‌ల నిర్ణయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. నియామకాల ప్రక్రియను కూడా కొనసాగిస్తాం. గతంలో కంటే తక్కువ మొత్తంలోనే ఉద్యోగులను నియమించుకుంటాం. ప్రస్తుతం కంపెనీకి ఎదురయ్యే సవాళ్లను సరైన పద్ధతిలో ఎదుర్కొంటున్నాం. కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామ’ని టిమ్‌ కుక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని