ఎన్‌సీసీ లాభం రూ.190 కోట్లు

నిర్మాణ రంగ సంస్థ ఎన్‌సీసీ, మార్చి త్రైమాసికంలో రూ.4981.36 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని, రూ.190.86 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 27 May 2023 02:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ రంగ సంస్థ ఎన్‌సీసీ, మార్చి త్రైమాసికంలో రూ.4981.36 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని, రూ.190.86 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసికంలో రూ.3491.76 కోట్ల ఆదాయంపై, రూ.242.13 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.15,701 కోట్లు, నికర లాభం రూ.609.20 కోట్లుగా ఉంది. రూ.2 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.2.20 (110%) డివిడెండు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. 2022-23లో కంపెనీ మొత్తం రూ.25,895 కోట్ల ఆర్డర్లను సంపాదించింది. ఎన్‌సీసీ కొత్త చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా సంజయ్‌ పూసర్లను నియమించినట్లు, జూన్‌ 1 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు