సన్‌ఫార్మా లాభం రూ.1984 కోట్లు

మార్చి త్రైమాసికంలో సన్‌ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ ఏకీకృత నికర లాభం రూ.1,984 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాలంలో కంపెనీ రూ.2,277 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడం గమనార్హం.

Published : 27 May 2023 02:03 IST

దిల్లీ: మార్చి త్రైమాసికంలో సన్‌ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ ఏకీకృత నికర లాభం రూ.1,984 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాలంలో కంపెనీ రూ.2,277 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. అసాధారణ అంశాలను మినహాయిస్తే నికర లాభం రూ.2156 కోట్లకు చేరినట్లు అవుతుందని కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.9,447 కోట్ల నుంచి రూ.10,931 కోట్లకు చేరుకుంది.

పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.43,886 కోట్ల ఆదాయం: 2022-23లో నికర లాభం రూ.8,474 కోట్లకు చేరుకుంది. 2021-22లో ఇది రూ.3,273 కోట్లే. అసాధారణ అంశాలను మినహాయిస్తే ఈసారి లాభం రూ.8,645 కోట్లకు చేరినట్లు అవుతుందని పేర్కొంది. కార్యకలాపాల ఆదాయాలు రూ.38,654 కోట్ల నుంచి రూ.43,886 కోట్లకు చేరుకున్నాయి. 2022-23 ఏడాదికి బోర్డు రూ.4 తుది డివిడెండును ప్రకటించింది. ‘స్పెషాలిటీ సహా మా పలు వ్యాపారాలు భారత్‌, ఇతర వర్థమాన మార్కెట్లలో ప్రగతిని కొనసాగించాయ’ని కంపెనీ ఎండీ దిలీప్‌ సంఘ్వి పేర్కొన్నారు. ‘కాన్సర్ట్‌ కొనుగోలు వల్ల చర్మ విభాగంలో మా పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతమైంద’ని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని