ఆల్కెమ్‌ లేబొరేటరీస్‌ నుంచి తల, గొంతు కేన్సర్‌ ఔషధం

ఆల్కెమ్‌ లేబొరేటరీస్‌, సెటుగ్జిమ్యాబ్‌కు బయోసిమిలర్‌ ఔషధాన్ని సెటుగ్జా పేరుతో దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ఈ మందును తల, గొంతు కేన్సర్‌కు చికిత్సలో వినియోగిస్తున్నారు.

Published : 30 May 2023 02:02 IST

దిల్లీ: ఆల్కెమ్‌ లేబొరేటరీస్‌, సెటుగ్జిమ్యాబ్‌కు బయోసిమిలర్‌ ఔషధాన్ని సెటుగ్జా పేరుతో దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ఈ మందును తల, గొంతు కేన్సర్‌కు చికిత్సలో వినియోగిస్తున్నారు. తక్కువ ధరలో ప్రాణాధార ఔషధాలను అందించాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా ఈ మందును ఆవిష్కరించినట్లు ఆల్కెమ్‌ లేటొరేటరీస్‌ పేర్కొంది. ఈ మందును ఐవీ (ఇంట్రావీనస్‌ ఇన్‌ఫ్లూజన్‌) ద్వారా బాధితులకు ఇస్తారు. మనదేశంలో ఏటా 5లక్షల మంది తల, గొంతు కేన్సర్‌ బాధితులుగా మారుతున్నారు. సెటుగ్జిమ్యాబ్‌ మందు ధర ఎక్కువగా ఉన్నందున, దీన్ని ఎక్కువ మంది వినియోగించలేని పరిస్థితి ఉన్నట్లు ఆల్కెమ్‌ ఎండీ సందీప్‌ సింగ్‌ పేర్కొన్నారు. తాము అందుబాటులో ధరలో దీన్ని తీసుకువచ్చినట్లు వివరించారు. పొగాకును అధికంగా వినియోగించే వారు, పొగ తాగే వారికి తల, గొంతు కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. అమెరికా, చైనా తర్వాత ఈ ముప్పును ఎదుర్కొంటున్న వారి సంఖ్య మనదేశంలోనే అధికంగా ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని