స్వరాజ్‌ నుంచి తేలికపాటి ట్రాక్టర్లు

మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ తాజాగా తేలికపాటి(లైట్‌వెయిట్‌) ట్రాక్టర్లను తీసుకొచ్చింది. ‘టార్గెట్‌’ పేరిట ఆవిష్కరించిన ఈ ట్రాక్టర్లు ఉద్యాన పంటల సాగులో ఉపయోగకరంగా ఉండనున్నాయి.

Published : 03 Jun 2023 02:04 IST

ప్రారంభ ధర రూ.5.35 లక్షలు

ముంబయి: మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ తాజాగా తేలికపాటి(లైట్‌వెయిట్‌) ట్రాక్టర్లను తీసుకొచ్చింది. ‘టార్గెట్‌’ పేరిట ఆవిష్కరించిన ఈ ట్రాక్టర్లు ఉద్యాన పంటల సాగులో ఉపయోగకరంగా ఉండనున్నాయి. వీటి ధరలు రూ.5.35 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభం కానున్నాయి. టార్గెట్‌ 630, టార్గెట్‌ 625 పేరిట రెండు ట్రాక్టర్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 20-30 హెచ్‌పీ విభాగంలో వీటిని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది. టార్గెట్‌ 630 తొలుత మహారాష్ట్ర, కర్ణాటకలోని తమ డీలర్‌ నెట్‌వర్క్‌ల ద్వారా అందుబాటులోకి రానున్నట్లు స్వరాజ్‌ తెలిపింది. టార్గెట్‌ 625ని మరికొన్ని రోజుల్లో మార్కెట్‌లోకి తీసుకొస్తామని పేర్కొంది. టార్గెట్‌ ట్రాక్టర్లలో అత్యాధునిక సాంకేతిక ఫీచర్లను పొందుపర్చినట్లు తెలిపింది. పురుగుమందుల పిచికారీ సహా ఇతర పనుల్లో మంచి సామర్థ్యం కనబరుస్తాయని పేర్కొంది.

బ్రాండ్‌ ప్రచారకర్తగా ధోనీ: స్వరాజ్‌ ట్రాక్టర్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్‌ ధోనీని ఎంపిక చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని