Adani shares: అదానీ షేర్లు.. మళ్లీ ఢమాల్‌

అదానీ గ్రూప్‌నకు చెందిన 10 షేర్లూ శుక్రవారం నష్టాల పాలయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు దాదాపు 7% పతనమైంది. దేశీయ మార్కెట్ల ధోరణితో పాటు లాభాల స్వీకరణా ఒక కారణమైతే..

Updated : 24 Jun 2023 09:57 IST

అమెరికా నియంత్రణ సంస్థల దర్యాప్తు వార్తల నేపథ్యం

అదానీ గ్రూప్‌నకు చెందిన 10 షేర్లూ శుక్రవారం నష్టాల పాలయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు దాదాపు 7% పతనమైంది. దేశీయ మార్కెట్ల ధోరణితో పాటు లాభాల స్వీకరణా ఒక కారణమైతే.. అదానీ గ్రూప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన అమెరికాకు చెందిన సంస్థాగత మదుపుదార్ల నుంచి ఆ దేశ నియంత్రణ సంస్థలు సమాచారాన్ని కోరాయన్న వార్తలు మరో కారణంగా నిలిచాయి.
ఇదీ జరిగింది: అదానీ గ్రూప్‌ తమ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచిందంటూ  హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన సంగతి విదితమే. ఈ విషయమై అమెరికా సంస్థాగత పెట్టుబడిదార్లకు అదానీ గ్రూప్‌ ఏం వివరణ ఇచ్చిందన్న దానిపై అమెరికా నియంత్రణ సంస్థలు దర్యాప్తు మొదలుపెట్టాయని అంతర్జాతీయ వార్తా సంస్థ ‘బ్లూమ్‌బర్గ్‌’ తెలిపింది.  సెక్యూరిటీస్‌ అండ్‌  ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ) దర్యాప్తు చేస్తోందనీ బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. వీటి వల్ల క్రిమినల్‌, సివిల్‌ విచారణ జరగాలనేమీ లేదు.
మా దృష్టికి రాలేదు.. అదానీ గ్రూప్‌: ‘అమెరికా నియంత్రణ సంస్థలు మా విషయమై అక్కడి పెట్టుబడిదార్లను వాకబు చేసినట్లు మా దృష్టికైతే రాలేదు. మా కంపెనీలు చట్టాలకు లోబడే అన్ని విషయాలను వెల్లడించాయన్న విశ్వాసం మాకుంద’ని అదానీ ప్రతినిధి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని