ప్రభుత్వ హామీ పథకాల్లో

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఇండెక్స్‌ తరగతికి చెందిన ఒక ఓపెన్‌ ఎండెడ్‌ టార్గెట్‌ మెచ్యూరిటీ పథకాన్ని ఆవిష్కరించింది. ‘యాక్సిస్‌ క్రిసిల్‌ ఐబీఎక్స్‌ ఎస్‌డీఎల్‌ జూన్‌ 2034 డెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 12న ముగుస్తుంది.

Published : 08 Mar 2024 00:23 IST

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఇండెక్స్‌ తరగతికి చెందిన ఒక ఓపెన్‌ ఎండెడ్‌ టార్గెట్‌ మెచ్యూరిటీ పథకాన్ని ఆవిష్కరించింది. ‘యాక్సిస్‌ క్రిసిల్‌ ఐబీఎక్స్‌ ఎస్‌డీఎల్‌ జూన్‌ 2034 డెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 12న ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. క్రిసిల్‌ ఐబీఎక్స్‌ ఎస్‌డీఎల్‌ ఇండెక్స్‌- జూన్‌ 2034 లో భాగంగా ఉన్న పత్రాలపై పెట్టుబడి పెట్టడం ఈ పథకం ప్రధానోద్దేశం. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ సెక్యూరిటీలు ఉంటాయి. ఈ పత్రాలపై ఇంట్రస్ట్‌ రేటు రిస్క్‌ అధికంగా, క్రెడిట్‌ రిస్క్‌ తక్కువగా ఉండటం గమనార్హం. వడ్డీ రేట్లు అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకంపై పెట్టుబడి పెట్టి పదేళ్ల పాటు కొనసాగించగలిగితే స్థిరమైన ప్రతిఫలం లభించే అవకాశం ఉంటుందని నిపుణుల అంచనా.


స్థిరమైన ప్రతిఫలం అందేలా

నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ ఒక ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ (ఎఫ్‌ఎంపీ)ను తీసుకొచ్చింది. ఇది క్లోజ్‌ ఎండెడ్‌ పథకం. అంటే గడువు తీరే వరకూ పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం  ఉండదు. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 11న ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. ‘క్రిసిల్‌ షార్ట్‌-టెర్మ్‌ బాండ్‌ ఇండెక్స్‌’ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా పరిగణిస్తారు. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో దాదాపు ఒక ఏడాది కాల వ్యవధి ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలు అధికంగా ఉంటాయి.


దీర్ఘకాలం కోసం

క్కువ నష్టభయంతో దీర్ఘకాలం పెట్టుబడికి అవకాశం కల్పించేలా బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక పథకాన్ని విడుదల చేసింది. ఈ బంధన్‌ లాంగ్‌ డ్యూరేషన్‌ ఫండ్‌ ప్రధానంగా డెట్‌, మనీ మార్కెట్‌ పథకాల్లో మదుపు చేస్తుంది. కనీసం 3-5 ఏళ్ల వ్యవధికి పెట్టుబడి పెట్టాలనుకునే వారు దీన్ని ఎంచుకోవచ్చు. ఈ నెల 18 వరకూ ఎన్‌ఎఫ్‌ఓ అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి మొత్తం రూ.1,000. నిఫ్టీ లాంగ్‌ డ్యూరేషన్‌ డెట్‌ ఇండెక్స్‌ ఏ-3 ప్రామాణికంగా ఇది పనిచేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని