ప్రత్యేక ఎఫ్‌డీ గడువు పెంపు : ఐడీబీఐ బ్యాంక్‌

పండగలను దృష్టిలో పెట్టుకొని అమృత్‌ మహోత్సవ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ప్రత్యేక పథకాన్ని అక్టోబరు 31 వరకూ కొనసాగిస్తున్నట్లు ఐడీబీఐ బ్యాంక్‌ వెల్లడించింది.

Updated : 22 Sep 2023 00:21 IST

పండగలను దృష్టిలో పెట్టుకొని అమృత్‌ మహోత్సవ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ప్రత్యేక పథకాన్ని అక్టోబరు 31 వరకూ కొనసాగిస్తున్నట్లు ఐడీబీఐ బ్యాంక్‌ వెల్లడించింది. ఈ పథకాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఈ అమృత్‌ మహోత్సవ్‌ ఎఫ్‌డీ 375 రోజులు, 444 రోజుల వ్యవధికి అందుబాటులో ఉంటుంది. 375 రోజుల వ్యవధికి సాధారణ డిపాజిటర్లకు 7.10 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీనిస్తోంది. 444 రోజుల వ్యవధి డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 7.15 శాతం, సీనియర్లకు 7.65 శాతం వడ్డీ అందిస్తోంది. వ్యవధికి ముందే డిపాజిట్లను ఉపసంహరించుకునే వీలుంది.


కొత్త ఖాతాదారులకు పీఎన్‌బీ స్వాగత్‌

ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వ్యక్తిగత రుణాలను అందించేందుకు పీఎన్‌బీ స్వాగత్‌ను ప్రారంభించింది. రుణానికి దరఖాస్తు నుంచి, మంజూరు వరకూ పూర్తిగా డిజిటల్‌లోనే ఉండేలా దీన్ని తీసుకొచ్చింది. దీనివల్ల ఖాతాదారుడు బ్యాంకును సంప్రదించాల్సిన అవసరం ఉండదు. 21 ఏళ్లు నిండిన వారికి ఈ రుణం ఇస్తుంది. రూ.25 వేల నుంచి ఈ రుణం తీసుకోవచ్చు. గరిష్ఠంగా రూ.10 లక్షల వరకూ లేదా ఏడాది కాలంలో 10 నెలల నికర వేతనం సగటుకు 10 రెట్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అంత మేరకు రుణం ఇస్తుంది. తిరిగి చెల్లించే వ్యవధి 72 నెలలు లేదా రుణగ్రహీతకు 60 ఏళ్లు వచ్చే వరకూ నిర్ణయించింది. రూ.6లక్షలకు మించి రుణం తీసుకున్నప్పుడు ఆధార్‌ ఆధారిత ఇ-సంతకం చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని