Google Bard: గూగుల్ బార్డ్ వచ్చేసింది.. ఎలా ఉపయోగించాలంటే?
గూగుల్ ఐ/ఓ 2023 (Google I/O 2023) ఈవెంట్లో కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్ ఏఐ టూల్ బార్డ్‌ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయగా.. కొత్తగా జెమిని పేరుతో మరో కొత్త ఏఐ టూల్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ ఐ/ఓ 2023 (Google I/O 2023) కార్యక్రమంలో సరికొత్త ఆవిష్కరణలను విడుదల చేసింది. ఈ వేదికపైనే ఏఐ టూల్ గూగుల్ బార్డ్ (Google Bard)ను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ (OpenAI ChatGPT), మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ (Microsoft Bing Chat)కు పోటీగా తీసుకొస్తున్న బార్డ్‌ను ఎలా ఉపయోగించాలి? అందులో ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం.
- బ్రౌజర్లో గూగుల్ బార్డ్ అని టైప్ చేయగానే.. సెర్చ్ రిజల్ట్‌లో బార్డ్ చాట్‌బాట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ట్రై బార్డ్ (Try Bard) ఆప్షన్ ఉంటుంది. అందులో నిబంధనల పేజీని కిందకు స్క్రోల్ చేసి ఐ అగ్రి (I Agree)పై క్లిక్ చేయాలి. తర్వాత బార్డ్ సెర్చ్ పేజీ ఓపెన్ అవుతుంది.
- యూజర్ సెర్చ్ బార్లో తనకు సమాచారం కావాల్సిన అంశం గురించి టెక్స్ట్ టైప్ చేయగానే.. బార్డ్ అందుకు సంబంధించిన సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. ఇతరులతో చాట్ చేసినట్లుగా యూజర్ బార్డ్ నుంచి సమాచారం పొందొచ్చు.
- మైక్రోసాప్ట్ బింగ్ చాట్‌లో మాదిరి గూగుల్ బార్డ్‌లో ఎలాంటి పరిమితిలేదు. ప్రస్తుతం టెక్స్ట్ రూపంలో మాత్రమే సమాచారం అందిస్తుంది. అలానే, యూజర్ బార్డ్ అడిగిన ప్రశ్నను ఒకటి కన్నా ఎక్కువసార్లు ఎడిట్ చేయొచ్చు.
- అలానే బార్డ్ చెప్పిన సమాచారాన్ని డాక్యుమెంట్ లేదా మెయిల్ ద్వారా ఇతరులతో షేర్ చేయొచ్చు. ఒకవేళ అదనపు సమాచారం కావాలంటే కిందనున్న గూగుల్ ఇట్ (Google It) ఆప్షన్‌తో ఆన్లైన్లో వెతకొచ్చు. బార్డ్ సమాచారంలో ఏదైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే పక్కనే ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి రిపోర్ట్ లీగల్ ఇష్యూ (Report Legal Issue) ఆప్షన్ క్లిక్ చేసి గూగుల్‌కు ఫిర్యాదు చేయొచ్చు.
- గూగుల్ బార్డ్‌లో రీసెట్ చాట్ (Reset Chat), బార్డ్ యాక్టివిటీ (Bard Activity) వంటి ఫీచర్లున్నాయి. రీసెట్ చాట్‌తో అప్పటి వరకు చేసిన చాట్ మొత్తం డిలీట్ అయిపోయి, కొత్త చాట్ పేజ్ ఓపెన్ అవుతుంది. బార్డ్ యాక్టివిటీ ఆప్షన్ ద్వారా అప్పటివరకు అడిగిన ప్రశ్నలను చూడొచ్చు.
- ప్రస్తుతం ఇంగ్లీష్‌లో మాత్రమే చాట్ చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని భాషల ద్వారా చాట్ చేసే సౌలభ్యంతోపాటు, పొటో, వీడియో సమాచారం అందించేలా మరింత అభివృద్ధి చేస్తామని గూగుల్ చెబుతోంది.
గూగుల్ జెమిని కూడా వచ్చేస్తోంది
గూగుల్ బార్డ్తోపాటు మరో కొత్త ఏఐ టూల్‌ను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు తెలిపింది. జెమిని (Gemini) పేరుతో తీసుకొస్తున్న ఈ చాట్‌బాట్ బార్డ్‌కు అడ్వాన్స్డ్ వెర్షన్‌గా గూగుల్ చెబుతోంది. జెమినీ చాట్‌బాట్ టెక్స్ట్తోపాటు ఫొటోతో కూడిన సమాచారాన్ని అందిస్తుంది. దీన్ని వేర్వేరు యాప్‌లు, ఉత్పత్తుల్లో ఉపయోగించుకునేలా అభివృద్ధి చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. అలానే టెక్స్ట్, ఫొటో, కోడింగ్ వంటి వాటికి సంబంధించి యూజర్లు పూర్తి సమాచారం పొందొచ్చని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం జెమిని పరీక్షల దశలో ఉందని, త్వరలో ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు పరిచయం చేస్తామని వెల్లడించింది.
గూగుల్ క్రోమ్‌లో అప్డేట్స్
క్రోమ్ (Google Chrome) బ్రౌజర్లో కొత్త అప్డేట్లను గూగుల్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా మెమొరీ సేవర్ (Memory Saver), ఎనర్జీ సేవర్ (Energy Saver), రీడింగ్ లిస్ట్ (Reading List) అనే మూడు మోడ్‌లను పరిచయం చేసింది. మెమొరీ సేవర్‌తో బ్రౌజర్లో ఇన్‌యాక్టివ్‌లో ఉండే ట్యాబ్స్ సిస్టమ్ మెమొరీని ఉపయోగించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల సిస్టమ్ వేగంగా పనిచేస్తుంది. సిస్టమ్ బ్యాటరీ 20 శాతం ఉన్నప్పుడు ఎనర్జీ సేవర్ మోడ్ క్రోమ్ బ్రౌజర్లో బ్యాగ్రౌండ్ యాక్టివిటీని, విజువల్ ఎఫెక్ట్స్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల యూజర్ సిస్టమ్ బ్యాటరీని ఎక్కువ సమయం ఉపయోగించుకునే వీలుంటుందని గూగుల్ వెల్లడించింది. రీడింగ్ లిస్ట్‌తో యూజర్లు గతంలో తాము బ్రౌజ్ చేసిన ట్యాబ్‌లను ఒక్క క్లిక్‌తో ఓపెన్ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
AP Assembly: ఎసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు
-
పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్