Hero MotoCorp: హీరో నుంచి వచ్చే ఏడాది మూడు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

Hero MotoCorp: వచ్చే ఏడాది మూడు విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను తీసుకురానున్నట్లు హీరో మోటోకార్ప్‌ వెల్లడించింది. 

Published : 23 Jan 2024 23:39 IST

Hero MotoCorp | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) తన విద్యుత్‌ వాహన వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మూడు ఎలక్ట్రిక్‌ వాహనాలు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ నిరంజన్‌ గుప్తా ‘హీరో వరల్డ్‌ 2024 ఈవెంట్‌’లో వెల్లడించారు.

‘2025 నాటికి విదా (ఎలక్ట్రిక్‌) శ్రేణిలోని వాహనాల్ని విస్తరించనున్నాం. మిడ్‌ ప్రైస్‌ సెగ్మెంట్‌, ఎకానమీ విభాగంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విడుదల చేయనున్నాం’ అని గుప్తా అన్నారు. వీటితో పాటు మరో విద్యుత్‌ ద్విచక్ర వాహనాన్ని లాస్ట్ మైల్ డెలివరీ విభాగంలో విడుదల చేయనున్నామని తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన జీరో మోటార్‌ సైకిల్స్‌ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్‌ బైక్‌లను తీసుకొచ్చే అవకాశాలపై దృష్టి సారించామన్నారు. భవిష్యత్తులో మాస్‌ సెగ్మెంట్‌లో విద్యుత్‌ మోటార్‌ సైకిళ్లను అభివృద్ధి చేయడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ ఫీజు ఇక డబుల్‌..?

ఈవీ అమ్మకాలను పెంచటంలో భాగంగా ఇప్పటికే 100 నగరాలకు విదా వాహనాలను అందుబాటులో తెచ్చామని, వచ్చే ఏడాది మరో 100 నగరాలకు పెంచుతామని హీరో మోటోకార్ప్‌ సీఈఓ తెలిపారు. ప్రీమియం విభాగంలో తాజాగా మార్కెట్‌లో ఆవిష్కరించిన మావెరిక్‌ 440 (Hero Mavrick 440 ), గతేడాది హీరో- హార్లే భాగస్వామ్యంలో వచ్చిన హార్లే డేవిడ్‌సన్‌ 440ఎక్స్‌ (HD440X) విభాగంలో కూడా కంపెనీ తన స్థానాన్ని పెంచుకోవాలని చూస్తోందని తెలిపారు. ప్రస్తుతం వీటి ఉత్పత్తి నెలకు 6,000 యూనిట్లకు ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి 10,000 యూనిట్లకు పెంచుతామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని