ITR Refund: ఆన్‌లైన్‌లో రిఫండ్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోండిలా..

Tax Refund Status: ఐటీర్ దాఖలు చేశారా? మీ రిఫండ్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవాలా? ఆన్‌లైన్‌లో రిఫండ్‌ స్టేటస్‌ సులభంగా ఎలా చెక్ చేసుకోవాలో చూసేయండి.

Published : 09 Aug 2023 15:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గత (2022-23) ఆర్థిక సంవత్సరానికి గానూ పెనాల్టీ లేకుండా ఆదాయ పన్ను రిటర్నులు  (ITR) దాఖలు చేయాల్సిన గడువు ముగిసింది. ముందుగా రిటర్నులు దాఖలు చేసిన కొందరికి రిఫండ్‌లు (ITR Refund) కూడా క్రెడిట్‌ అవుతున్నాయి. అయితే మరికొందరేమో ఎప్పుడెప్పుడు ఖాతాలో సొమ్ము పడుతుందా అంటూ ఎదురుచూస్తున్నారు. ఒక వేళ మీరు కూడా రిఫండ్‌ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ రిఫండ్‌ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవటం ద్వారా మీ అమౌంట్ ఎప్పుడు జమ అవుతుందో తెలుసుకోవచ్చు. 

రిఫండ్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవడం ఎలా?

  •  ముందుగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఇ-పైలింగ్‌ ట్యాక్స్‌ పోర్టల్‌కు వెళ్లండి.
  •  యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్‌ అవ్వండి.
  • ‘Income tax returns’ లోకి వెళ్లి ‘View Filed Returns’ పై క్లిక్ చేయాండి.
  •  అందులో ‘View Details’ ఆప్షన్‌ను ఎంచుకోగానే ‘Status of Tax Refunds’ ట్యాబ్‌కు తీసుకెళ్తుంది.
  •  అందులో పేమెంట్ మెథడ్‌, రిఫరెన్స్ నంబర్‌, కరెంట్ స్టేటస్‌తో పాటు రీఎంబర్స్‌మెంట్‌ స్టేటస్‌ మోడ్‌ కనిపిస్తాయి.

రాజస్థాన్‌ అందాలు వీక్షించాలనుకుంటున్నారా..?.. IRCTC ప్యాకేజీ వివరాలివే..

ఇలా కూడా చెక్‌ చేసుకోవచ్చు..

  •  రిఫండ్‌ స్టేటస్‌ కోసం NSDL పోర్టల్లోని ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
  •  మీ పాన్‌ కార్డ్‌ నంబర్‌ లేదా ట్యాన్‌ నంబర్‌లో మీకు అందుబాటులో ఉన్న దాన్ని ఎంచుకొని ‘proceed’ పై క్లిక్ చేయాలి.
  •  అందులో పాన్‌ కార్డ్‌ నంబర్‌/ట్యాన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి మదింపు సంవత్సరాన్ని ఎంచుకొని కనిపిస్తున్న క్యాప్చాను ఎంటర్ చేయాలి.
  •  ‘Submit’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయగానే ఐటీఆర్‌ రిఫండ్‌ స్టేటస్ మీకు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని