ఎన్నికల తర్వాత ఏఐ నియంత్రణకు చట్టం: అశ్విని వైష్ణవ్

AI law: త్వరలోనే ఏఐపై చట్టాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Published : 06 Apr 2024 00:07 IST

AI law | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో ఈ సాంకేతికతపై నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులోభాగంగా ఏఐపై కొత్త చట్టాన్ని రూపొందించాలని చూస్తోంది. ఈవిషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే ఏఐ నియంత్రణకు చట్టం తీసుకొచ్చే చర్యలు ప్రారంభిస్తామని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Gold reserves: ‘బంగారు కొండ’ పేరుస్తున్న ఆర్‌బీఐ!

‘‘ఏఐ కోసం స్వీయ నియంత్రణ అనేది ఏమాత్రం సరిపోదు. ఇది చట్టబద్ధంగానే జరగాలని మేం భావిస్తున్నాం. ఎన్నికలు ముగిశాక ఈ ప్రక్రియను ప్రారంభిస్తాం’’ అని వైష్ణవ్‌ తెలిపారు. ఇప్పటికే పరిశ్రమ వర్గాలతో చర్చించామని, ఎన్నికల తర్వాత మరోసారి చర్చించి చట్టం తీసుకొస్తామన్నారు. సృజనాత్మకతకు, ఆవిష్కరణలకు విఘాతం కలగకుండా ఈ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఏఐ ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్‌ వీడియోలు.. వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు బాధితులయ్యారు. దీంతో నియంత్రణకు చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని