Instagram: ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌.. ఇకపై రీల్స్‌లోనూ పాటల లిరిక్స్‌

Instagram: రీల్స్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. తాజాగా రీల్స్‌లోనూ పాటల లిరిక్స్‌ జత చేసే ఆప్షన్‌ను ఇచ్చింది. ఎలా యాడ్‌ చేయాలో చూద్దాం..

Published : 03 Nov 2023 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ దిగ్గజం మెటా ఆధ్వర్యంలోని సోషల్‌ మీడియా యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఇన్‌స్టా స్టోరీస్‌కు మాత్రమే పరిమితమైన పాటల లిరిక్స్‌ను జత చేసే ఫీచర్‌ను ఇప్పుడు రీల్స్‌ (Insta Reels)కూ విస్తరించింది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇన్‌స్టా ఛానెల్స్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇప్పటి వరకు యూజర్లు రీల్స్‌లోని సాంగ్స్‌కు లిరిక్స్‌ యాడ్‌ చేయాలంటే మాన్యువల్‌గా టైప్‌ చేయాల్సి వస్తోంది. కానీ, ఇకపై ఆ అవసరం ఉండదని ఆయన తెలిపారు.

ఎలా యాడ్‌ చేయాలంటే..

  • ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ ఓపెన్‌ చేయాలి.
  • రీల్‌ క్రియేట్‌ చేసి మ్యూజిక్‌ బటన్‌పై ట్యాప్‌ చేయాలి.
  • రీల్‌కు జత చేయాల్సిన పాటను ఎంచుకోవాలి.
  • ఎడమ వైపు స్వైప్‌ చేసి లిరిక్స్‌ను యాడ్‌ చేయొచ్చు.

రీల్స్‌ (Insta Reels)కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్‌స్టా మరిన్ని కొత్త, వినూత్నమైన ఫీచర్లను తీసుకొచ్చే యోచనలో ఉంది. ‘ఏఐ ఫ్రెండ్‌’ అనే ఆప్షన్‌తో కృత్రిమ మేధ ఆధారిత ఊహాజనిత మిత్రుడిని సృష్టించుకునేలా ఓ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు, క్లిష్టమైన పరిస్థితుల్లో పరిష్కారాల కోసం ఏఐ ఫ్రెండ్‌ సహాయంగా ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత ఫీచర్లు చాలా రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని