Education Loans: ఉన్న‌త విద్యా రుణాల‌కు ప్ర‌ముఖ బ్యాంకుల వ‌డ్డీ రేట్లు ఎలా ఉన్నాయి..?

భార‌త్‌లో ఖ‌రీదైన వ్య‌వ‌హారాల‌లో ఉన్న‌త విద్య ఒక‌టి.

Updated : 19 Aug 2022 16:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు విద్యార్థులు ఉన్న‌త విద్య‌కు ఎన‌లేని ప్రాముఖ్య‌త ఇస్తున్నారు. త‌మ ఉన్న‌త విద్య‌కు దేశంలో వివిధ విశ్వ‌విద్యాల‌యాల‌లోని కోర్సుల్లో విద్య‌నభ్య‌సించ‌డానికి ముంద‌డుగు వేస్తున్నారు. ఈ విద్య‌కు స‌రిప‌డా నిధులను సమకూర్చడం తల్లిదండ్రులకు కష్టతరమైన విషయమే.. ఇలాంటప్పుడు విద్యార్థులకు విద్యా రుణమే శ‌ర‌ణ్యం. మీకు మంచి విద్యార్హ‌త‌లు ఉండి, ఉన్న‌త విద్య చ‌ద‌వ‌డానికి అర్హ‌త పొందితే ప్ర‌ముఖ విద్యా సంస్థ‌ల్లో చ‌దువుకోవ‌డానికి విద్యా రుణం కోసం బ్యాంకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మీ విద్యా నేప‌థ్యం, త‌ల్లిదండ్రుల ఆదాయం, మంచి క్రెడిట్ స్కోరు, మీ రుణ అర్హ‌త‌ను నిర్ణ‌యించ‌డంలో కీల‌క‌మైన అంశాలుగా ఉంటాయి. ఆర్‌బీఐ ఇప్ప‌టివ‌ర‌కు కీల‌క‌మైన పాల‌సీ రేటును మొత్తంగా 140 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆర్‌బీఐ రేట్ల‌ను పెంచ‌డం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి విద్యా రుణాల వ‌డ్డీ రేట్లు పెరిగాయి.

7 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధికి, రూ. 20 ల‌క్ష‌ల విద్యా రుణంపై ఈఎంఐలు ఈ కింది విధంగా ఉన్నాయి.

గ‌మ‌నిక: ఈ డేటా 2022 ఆగస్టు 18 నాటిది. ఈఎంఐలో ప్రాసెసింగ్ ఫీజులు, ఇత‌ర ఛార్జీలు క‌ల‌ప‌లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని