Credit Profile: ఈ చిట్కాలతో క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపర్చుకుందాం!
Credit Profile: మంచి క్రెడిట్ ప్రొఫైల్ మన మెరుగైన ఆర్థిక జీవనానికి పునాదులు వేస్తుంది. అందుకే దానిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుకుండా చూసుకోవాలి. ఈ క్రమంలో లోన్‌ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..!
ఇంటర్నెట్ డెస్క్: లోన్ల (Loan) విషయంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, చాలా మంది లోన్లు అనగానే బ్యాంకుల నుంచి తీసుకున్నవనే అనుకుంటారు. కానీ, క్రెడిట్ కార్డు, ఆన్‌లైన్ యాప్‌లు, లేదా ఇతర ఆర్థిక సాధనాల ద్వారా తీసుకున్న డబ్బును కూడా రుణాలుగానే పరిగణించాలి. అందుకే లోన్ (Loan) కోసం దరఖాస్తు చేసుకునే ముందు కొన్ని కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. తద్వారా మీ క్రెడిట్ ప్రొఫైల్ (Credit Profile) దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.
సరిపోయే ప్రోడక్ట్‌లనే ఎంచుకుందాం..
పెరుగుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మార్కెట్‌లో అనేక ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఫిన్‌టెక్ రంగం పుంజుకుంటుండడం దీనికి మరింత ఊతమిచ్చింది. పైగా డేటా అనలిటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఆర్థిక సంస్థలు విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. ఫలితంగా ఎవరికి ఎలాంటి ఉత్పత్తులు సరిపోతాయి? తమ ఉత్పత్తులకు సమర్థులైన కస్టమర్లు ఎవరో తెలుసుకోవడం సంస్థలకు సులభమైపోయింది. అలాగే మార్కెట్‌లో కస్టమర్లకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో సంస్థలు ఇట్టే కనిపెట్టేస్తున్నాయి. అందుకు అనుగుణంగా ప్రీ-అప్రూవ్డ్ లోన్లను కూడా ఆఫర్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సరైన ప్రొడక్ట్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. సకాలంలో చెల్లింపులు చేయగలమనుకున్నప్పుడే లోన్ తీసుకోవడం ఉత్తమం. అప్పుడే క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. అలా కాకుండా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి కదా అని మీకు సరికాని ప్రోడక్ట్‌ను ఎంచుకుంటే ఇబ్బందులు తప్పవు.
అవసరమైతేనే వివరాలిద్దాం..
‘డేటా’ను ఆధునిక ఇంధనంగా నిపుణులు అభివర్ణిస్తుంటారు. లోన్ కోసమో లేక ఇతర అవసరాల కోసమో మనం మన సమాచారాన్ని కంపెనీలకు అప్పజెబుతున్నాం. ఆన్‌లైన్‌లో ఏదైనా ఆకర్షణీయ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ కనిపిస్తే చాలు.. వ్యక్తిగత సమాచారం మొత్తం ఎంటర్ చేసేస్తున్నాం. దీని వల్ల పాన్, ఆధార్ వంటి సున్నితమైన సమాచారం తస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. దీని వల్ల మన క్రెడిట్ ప్రొఫైల్ కూడా ఇతరులకు తెలిసిపోవచ్చు. ఇది దుర్వినియోగానికి దారితీయొచ్చు. ఫలితంగా మీ క్రెడిట్ స్కోర్ తద్వారా ప్రొఫైల్‌పై మరక పడే అవకాశం ఉంది. అందుకే ఎక్కడైనా సమాచారం ఇచ్చే ముందు చాలా జాగ్రత్త వహించాలి. అవసరతమైతేనే వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి.
ముందే క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుందాం..
కొత్త లోన్ తీసుకునే ముందు ప్రతిఒక్కరూ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోవాలి. ఫలితంగా మీ క్రెడిట్ ప్రొఫైల్ ఎలా ఉందనే విషయాన్ని మీరు క్షుణ్నంగా పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా కొత్త లోన్‌కు వెళ్లాలా? లేదా? నిర్ణయించుకోవచ్చు. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే.. వడ్డీరేటు అధికంగా ఉంటుంది. కొన్ని సంస్థలు దరఖాస్తును తిరస్కరించనూ వచ్చు. ఇలాంటి తిరస్కరణలు క్రెడిట్ ప్రొఫైల్‌పై మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు తలెత్తొచ్చు. వివిధ వెబ్‌సైట్‌లు, యాప్‌లు ఇప్పుడు ఉచితంగానే క్రెడిట్ స్కోర్ వివరాలను అందజేస్తున్నాయి.
ఎక్కువ లోన్‌లకు దరఖాస్తు చేయొద్దు..
స్వల్పకాలంలో ఎక్కువ సంఖ్యలో లోన్‌లకు దరఖాస్తు చేసుకోకపోవడం ఉత్తమం. అలా చేస్తే మీరు రుణాలపై అధికంగా ఆధారపడుతున్నారనే విషయం స్పష్టమవుతుంది. ఇది క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా లోన్ పొందే అవకాశాలు సన్నగిల్లుతాయి. వడ్డీరేటు విషయంలోనూ బేరమాడే అవకాశాన్ని కోల్పోతారు. అందుకే అవసరాన్ని బట్టి.. మంజూరయ్యే అవకాశం ఉన్న లోన్‌లకే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.
చివరగా.. దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా అవసరం. ఈ క్రమంలో మంచి క్రెడిట్ ప్రొఫైల్‌ను మెయింటైన్ చేయడానికి నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. అందుకే లోన్ల విషయంలో పైన తెలిసిన సూత్రాలకు కట్టుబడి సంపన్నమైన ఆర్థిక ప్రయాణానికి పునాది వేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: మాజీ మంత్రి బండారుకు నారా లోకేశ్ ఫోన్
-
PM Modi: అభివృద్ధిపై వాళ్లకు విజన్, రోడ్‌మ్యాప్ లేవు.. విపక్షాలపై మోదీ ఫైర్
-
Rajinikanth: రజనీకాంత్ 170వ చిత్రం.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్.. ఎవరెవరంటే?
-
Vande Bharat Train: ట్రాక్‌పై రాళ్లు.. వందే భారత్ లోకో పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
-
Pawan Kalyan: మున్ముందు దేశమంతా జనసేన భావజాలమే: పవన్ కల్యాణ్
-
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..